సినిమాలు పక్కన పెట్టి.. వెబ్ సిరీస్ ల వెంట!

‘గోవా బ్యూటీ’ ఇలియానా బాలీవుడ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అడపాదడపా విజయాలు అందుకున్నా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.. డిమాండ్ మాత్రం పెరగలేదు. దీంతో ఓటీటీలపై దృష్టి పెట్టాలని ఇలియానా డిసైడ్ అయిందట.
‘నెట్ ఫ్లిక్స్’, ‘ఆల్ట్ బాలాజీ’ వంటి సంస్థలతో ఇలియానా డీల్ కుదుర్చుకునే పనిలో పడిందట.ఓ వెబ్ సిరీస్‌లో నటించడంతోపాటు.. మరో వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తోందట. దక్షిణాదిన కూడా ఇలియానాకు గుర్తింపు ఉండడం ఆమెకు ప్లస్ అయ్యింది. దాంతో ఓటీటీలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ఇలియానా నటిస్తానంటే.. భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు సిద్ధంగానే ఉన్నాయట. దీంతో ప్రస్తుతానికి సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లే చెయ్యాలని ఇలియానా నిర్ణయం తీసుకుందట.
 
మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది!
‘‘నా బుర్రలోని ‌ఆలోచనలు నన్ను మానసికంగా ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ ఒక్కసారి నేను వర్కౌట్స్‌ చేయడం ప్రారంభిస్తే అవన్నీ మాయమైపోతాయి. అంతేకాదు నా లక్ష్యానికి నేను మరింత దగ్గరగా వస్తున్నానన్న భావన కలుగుతుంది’’ అంటోంది ఇలియానా.
‘వ్యాయామానికి రోజూ ఎంత సమయం కేటాయిస్తారు? అని ఇలియానాను అడిగితే – ‘‘ప్రస్తుతం ఆన్‌లైన్‌ వర్కౌట్‌ ప్రోగ్రామ్‌ చేస్తున్నాను.ప్రతి రోజూ ఓ కొత్త వర్కౌట్‌ను ట్రై చేస్తున్నాను. నా వర్కౌట్‌ సమయం అన్ని రోజులూ ఒకేలా ఉండదు. ఒకరోజు 75 నిమిషాలు, మరో రోజు 45 నిమిషాలు.. ఇలా రోజు రోజుకీ తేడా ఉంటుంది. ఒక్కో రోజు జస్ట్‌ యోగా మాత్రమే చేస్తాను. ఫిట్‌గా ఉండటానికి, మానసిక ఆరోగ్యం బాగుండేందుకు మీరు కూడా వర్కౌట్స్‌ చేసి చూడండి. వచ్చే ఫలితం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’’ అని అంటోంది ఇలియానా.
నాఎంట్రీ పాత్ర వారికి ఎంతగానో నచ్చింది!
‘బర్ఫీ’లో శ్రుతి ఘోష్‌ పాత్రని దక్షిణాది ప్రేక్షకులు ఎలా తీసుకునేవారో తెలియదుగానీ..బాలీవుడ్‌లో మాత్రం ‘బహు బాగా నటించావు’ అని ప్రశంసించారు.. అని చెప్పింది ఇలియానా తన బాలీవుడ్ ఎంట్రీ చిత్రం గురించి చెబుతూ. ‘‘దక్షిణాదిలో సుపరిచితం అయినప్పటికీ, బర్ఫీ చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు కొత్త నటినే. అది ప్లస్‌ అయింది. నాకైతే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ప్రయోగాలు చేయడానికి ఒక వేదిక దొరికినట్లయింది. ప్రేక్షకులకు నా పాత్ర ఎంతగానో నచ్చింది. ఇది నేను ఊహించనిది. నేను ఎప్పుడూ కంఫర్ట్‌జోన్‌ను ఇష్టపడను. అది దాటి బయటికి వచ్చినప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అవకాశం దొరుకుతుంది’’ అంటోంది ఇలియానా .మాంచి మాస్‌ మసాలా సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ కావాలనుకుంది ఇలియానా. అయితే ‘బర్ఫీ’ మసాలా సినిమా‌ కాదు. ‘‘స్టోరీ విన్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలు తీసుకున్నాను. ఇలాంటి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించాను. నా కోరిక ఎలా ఉన్నప్పటికీ ‘బర్ఫీ’లాంటి కథ మళ్లీ చేసే అవకాశం దొరుకుతుందో లేదో అని చేశాను. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తాను.