మొదట్లో ఏదోలా మేనేజ్ చేసేదాన్ని !

’15 ఏళ్ల వయసులో మూవీలో చాన్స్ వచ్చింది. అయితే నేను అంతగా నటించను. మీ భాష రాదు, మాట్లాడను. నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను … అని షరతులు పెట్టినా దర్శకుడు ఒప్పుకున్నారు. షూటింగ్ విదేశాల్లో అనగానే.. పైసా ఖర్చులేకుండా అమెరికాకు వెళ్తున్నానని సంబరపడ్డాను.తెలుగు, హిందీ భాషలు నాకు అసలే రావు. అయితే ఇంటర్వ్యూలో హిందీలో బదులు చెప్పమని అడిగినా.. ఇంగ్లీష్‌లో ఏదోలా మేనేజ్ చేసేదాన్ని….’ అని చెప్పింది టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి ఇలియానా.

ఇలియానా దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లాక ఆమె జోరు పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ తొలి చిత్రం బర్ఫీతో మంచి మార్కులే కొట్టేసినా.. ఈ గోవా సుందరికి అవకాశాలు మాత్రం గడప తొక్కలేదు. ఈ బ్యూటీ గత ఐదేళ్లలో ఐదు హిందీ మూవీల్లో మాత్రమే నటించింది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ భామ “ముబారకన్” తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో తన సినీ అనుభవాలను ఆమె షేర్ చేసుకుంది….

టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలతో పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ హిందీపైనే ఎక్కువ దృష్టిపెట్టాను. నా లేటెస్ట్ మూవీ “ముబారకన్”. ఇందులో పంజాబీ అమ్మాయిగా ఆకట్టుకుంటాను. అర్జున్ కపూర్, అనిల్ కపూర్ లాంటి స్టార్లతో పని చేసిన ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. టాలీవుడ్‌లో తొలిమూవీ ఎనర్జిటిక్ హీరో రామ్‌తో కలిసి చేశాను. అతడితో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాను. తొలిరోజు స్క్రిప్టు ఇచ్చాక ఎలా పలకాలో సాయం చేయాలని రామ్‌ను అడిగాను. అతడు ఆ మాటలు చదివి వినిపించగానే నేను గట్టిగా నవ్వేశాను. నాకు భాష రాకపోవడంతో తొలుత అతడు జోక్ చేస్తున్నాడని భావించాను. క్రమక్రమంగా నటనపై దృష్టిపెట్టి ఎంతో నేర్చుకున్నానని’ నటనలో తొలి రోజులను ఇలియానా వివరించారు. “ముబారకన్” జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది.