వాటిని తప్పించుకోవడంలో సిద్ధహస్తురాలిని !

వాటిని తప్పించుకోవడంలో సిద్ధహస్తురాలినంటున్నారు ఇలియానా. హీరోయిన్లకు  కొన్ని ‘చేదు అనుభవాలు’ ఎదురవుతుంటాయి. హఠాత్తుగా జరిగే ఆ పరిణామాలతో వారు షాకవుతుంటారు . ప్రత్యేకించి హీరోయిన్లకు అలాంటి అనుభవాలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. అలాంటి జాబితాలో ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకోణ్ వంటి స్టార్ హీరోయిన్లంతా ఉన్నారు. ఆ జాబితాలో ఇలియానా కూడా ఉన్నా.. వాటిని తప్పించుకోవడంలో సిద్ధహస్తురాలినంటున్నారు ఇలియానా. పబ్లిక్‌లో అలా ఎంబరాజింగ్ (చేదు అనుభవం) సందర్భాలు రెండు సార్లు ఎదురయ్యాయంటూ గోవా బ్యూటీ చెప్పుకొచ్చారు. వాటిని ఎలా తప్పించుకున్నారో కూడా చెప్పారు….

‘‘ఒక్కటి కాదు.. అలాంటి చేదు అనుభవాలను ఎన్నో ఎదుర్కొన్నా. ఓ సారి “బర్ఫీ” సినిమాకు గానూ వచ్చిన అవార్డును అందుకునేందుకు చిత్ర యూనిట్‌తో కలిసి స్టేజీ ఎక్కుతున్నాం. అప్పుడే ఉన్నట్టుండి నా డ్రెస్ వెనక భాగంలో ఓపెన్ అయిపోయింది. అయితే ఏమీ జరగనట్టే ముందుకు వెళ్లి అవార్డు తీసుకున్నా. మళ్లీ వచ్చి యధాస్థానంలో కూర్చున్నా. ఆ సంఘటన గురించి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇక, మరో సందర్భంలో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. అక్కడ కూడా నా వెనక నడుం కింది భాగంలో డ్రెస్ చిరిగిపోయింది. అదృష్టం కొద్దీ దానిని ఎవరూ గమనించలేదు. కాబట్టి ఎవరికీ అనుమానం రాకుండా నేను కూడా మామూలుగానే ఉండిపోయా’’ అంటూ తనకు ఎదురైన  చేదు సందర్భాల గురించి వివరించారు ఇలియానా. అట్లాంటివి జరిగినప్పుడు ఎక్కువగా పట్టించుకుంటేనే అందరికీ తెలిసిపోతుందని, కాబట్టి ఏమీ జరగలేదన్నట్టుగా ఉంటేనే అలాంటి ఘటనలు ఎవరి కంటా పడకుండా గుట్టుగా ఉండిపోతాయని అంటోంది ఇలియానా.