మంచి ఆఫర్ ఇస్తే దక్షిణాదిలో మళ్లీ కనిపిస్తా !

ఇలియానా నటించిన ‘ముబారకన్‌’ ఈ నెల 28న, ‘బాద్‌షాహో’ సెప్టెంబర్‌లో విడుదలవుతున్నాయి. ఈ రెండు తప్ప ఆమె చేతిలో మరో సినిమా లేదు.అందువల్ల, సౌత్‌ సినిమాల్లో ఛాన్సుల కోసం ఇలియానా ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిపై ఇలియానా స్పందిస్తూ…. ‘‘గతంలో ఏడాదిన్నర నేను ఖాళీగా ఉన్నప్పుడూ ఇలానే రాశారు. సౌత్‌లో నటించడం నాకిష్టమే. అక్కడ మంచి క్రేజీ కలర్‌ఫుల్‌ ఫిల్మ్స్‌ తీస్తారు. టైమ్‌ కుదరక నటించడం లేదంతే. హిందీలో ఛాన్సులు లేవని సౌత్‌లో ప్రయత్నిస్తున్నానని అనడం తప్పు. సౌత్‌లో కొందరు దర్శక–నిర్మాతలతో డిస్కషన్స్‌ చేసిన సినిమాలు వర్కౌట్‌ కాలేదు. ఛాన్స్‌ వస్తే మళ్లీ గ్లామర్‌ హీరోయిన్‌గా నటించడం నాకిష్టమే’’ అన్నారు.

ఇలియానా దక్షిణాదిన చేసిన తప్పునకు చింతిస్తోందట. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలోఇలియానా చెప్పిన మాటలివి…దక్షిణాదిలో తీరిక లేకుండా సినిమాలు చేశానని, ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమాకు సంతకం చేసేసేదాన్నని చెప్పుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరో సినిమా షూటింగులోనూ పాల్గొనేదాన్నని చెప్పింది. తన కమిట్మెంట్లకు గౌరవం ఇచ్చే అలా చేశానని, దానికి ఇప్పుడు తాను చింతిస్తున్నానని చెప్పింది. అయితే.. ఎంత బిజీ షెడ్యూళ్లు ఉన్నా పనిని మాత్రం అమితంగా ఎంజాయ్ చేశానని చెప్పింది. అంతేకాదు.. మంచి, ఎగ్జైటింగ్ ఆఫర్ ఇస్తే దక్షిణాదిలో మళ్లీ కనిపిస్తానని చెప్పుకొచ్చింది గోవా బ్యూటీ ఇలియానా.