పరమ చెత్త హిందీ సినిమాల సరసన ‘రేస్ 3’

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ’ రేస్ 3′ ఓ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో బాగానే ఉన్నా.. రీవ్యూలు మాత్రం నెగటివ్‌గా వచ్చాయి. పరమ చెత్త హిందీ సినిమాల్లో రేస్ 3 ఒకటని ఐఎండీబీ తేల్చేసింది. ఈ సినిమాకు ఐఎండీబీ పదికి కేవలం 2.6 రేటింగ్ ఇచ్చింది. యూజర్లు ఇచ్చిన రేటింగ్‌ల సగటును బట్టి ఐఎండీబీ రేటింగ్ ఇస్తుంది. రాంగోపాల్ వర్మ కీ ఆగ్ (1.9), హిమ్మత్‌వాలా (2), హమ్‌షకల్స్ (2.1), క్యా కూల్ హై హమ్ (2.4)ల తర్వాత రేస్ 3 నిలిచింది.

‘రేస్’ ఫ్రాంచైజ్‌లో ఇది మూడోది. తొలి రెండు పార్ట్‌లకు అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించగా.. సైఫ్ అలీ ఖాన్, అనిల్ కపూర్, బిపాషా బసు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ‘రేస్ 3’లో సల్మాన్‌ఖాన్‌తోపాటు బాబీ డియోల్, అనిల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా నటించారు. ఈ మూవీకి రెమో డిసౌజా దర్శకత్వం వహించాడు. ఇప్పటివరకు ‘రేస్ 3’ బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లు వసూలు చేసింది.