‘ఇంటర్నేష్నల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్’ లో ఎంపికైన ఏకైక తెలుగు లఘు చిత్రం ‘ఇందీవరం’. ‘ఇందీవరం’… ఇది ఇద్దరు పిల్లల కథ. మురికికూపంగా మారిన సమాజమనే బురదలో వికసించిన రెండు కలువల కథ. అమ్మానాన్నల ఆలనలో అబ్బరంగా పెరగాల్సిన పసి కూనలు అనాథలైతే.. వారి పట్ల సమాజం వైఖరి.. ఏ విధంగా ఉంటుందో అద్దం పట్టిన కథ. ప్రతి మనిషిలోనూ నిద్రాణమై ఉన్న మంచితనాన్ని తట్టి లేపే కథ. ప్రశాంతతకు మించిన ధనం వేరొకటి ఉండదని తెలియజెప్పిన కథ. పిల్లలు దైవంతో సమానమని ఎందుకంటారో… ప్రత్యక్షంగా చూపించిన కథ. మెలిపెట్టే భావోద్వేగాల సమ్మేళనమే ఈ కథ… అదే… ‘ఇందీవరం’. ఈ లఘుచిత్రం.. విమర్శకుల ప్రశంసలందుకుందుకోవడమే కాక.. 2017… 20వ బాలల చిత్రోత్సవంలో ఎంపికయ్యింది. ఏషియా వైడ్ లో జరిగే ఈ పోటీల్లో ‘ఇందీవరం’ స్థానం సంపాదించుకోవడం ఓ విశేషమైతే.. . తెలుగు నుంచి ఒక్క ‘ఇందీవరం’ మాత్రమే ఎంపిక అవ్వడం మరో విశేషం.
గతంలో రూపొందిన ‘అబ్దుల్’ అనే లఘు చిత్రం కూడా… 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో ప్రదర్శితమై పలువురి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు 20వ బాలల చిత్రోత్సవంలో కూడా ఈ లఘు చిత్రం ప్రదర్శితమవ్వడం పట్ల ఆనందం వ్యక్తం అయ్యింది. ఈ సందర్భంగా ‘ఇందీవరం’ లఘుచిత్రానికి దర్శకత్వం వహించిన సాయితేజ మాట్లాడుతూ ’’ మూర్తి కనకాల అనే ఓ వ్యక్తి… ఫేస్ బుక్ లో పెట్టిన ఓ కథనాన్ని ఆధారంగా చేసుకొని తయారు చేసుకున్న కథ ఇది. ఇలాంటి మంచి కథకు దర్శకత్వం వహించే అదృష్టాన్ని నాకందించిన వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అన్నారు.