నేను స్టార్‌ననే భావనే నా దగ్గరికి రానివ్వను !

‘బాద్షా ఆఫ్ బాలీవుడ్’ షారుక్‌ఖాన్ తాజాగా “జబ్ హ్యారి మెట్ సెజల్” మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనుష్కశర్మ, షారుక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ కి ఆడియెన్స్ నుంచి మంచి  రెస్పాన్స్ వస్తున్నది. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో షారుక్ జాతీయ  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో….

“తాను సూపర్‌స్టార్‌ను అవ్వాలని సినిమాల్లోకి రాలేద”న్నాడు . “సినిమాలకు సంబంధించి సక్సెస్, ఫెయిల్యూర్ తక్కువ టైంలోనే తెలిసిపోతాయి. కొన్ని సార్లు సినిమాలు బాగా ఆడతాయి. మరికొన్ని సార్లు ఫెయిలవుతాయి. విజయం సాధించినపుడు సంతృప్తిగా ఫీలవుతా. సినిమాకు నెగెటివ్ కామెంట్స్ వస్తే బాధపడతా. కానీ ఇవన్నీ కేవలం అయిదారుగంటల్లోనే జరిగిపోతాయి. ఆ వెంటనే యాక్టివ్‌గా పని ప్రారంభిస్తా. ఇండస్ట్రీలో నేనూ స్టార్‌గా పిలువబడతానని ఎప్పుడూ అనుకోలేదు”

“స్టార్‌డమ్‌కు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నేనో స్టార్‌ననే భావననే నా దగ్గరికీ రానివ్వను. నా వర్క్ నుంచి మంచి అవుట్‌పుట్ తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. నా విషయంలో ఇదే నాకు పెద్ద టాస్క్ లాంటిద”ని తన మనసులోని మాటలను షేర్ చేసుకున్నాడు షారుక్. ఇంతియాజ్ డైరెక్షన్‌లో తెరకెకుతున్న “జబ్ హ్యారి మెట్ సెజల్” మూవీని షారుక్ భార్య గౌరీఖాన్ నిర్మిస్తోంది