ఆ సమయంలో నన్ను ‘కిక్’ చాలా ఆదుకుంది !

సక్సెస్ చేతిలో ఉన్నప్పుడు గతాన్ని గుర్తుచేసుకోవడం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ కొందరు అందుకు మినహాయింపు అని చెప్పొచ్చు. వర్తమానం ఎంత ఊపులో ఉన్నా గతాన్ని ఏ మాత్రం మరచిపోలేని వారు కొందరుంటారు. తాను ఆకోవలోకే చేరుతానంటోంది ఈ  విదేశీ భామ. గతాన్ని గుర్తుచేసుకుంటూనే వర్తమానాన్ని  సద్వినియోగం చేసుకుంటానంటూ  చెబుతోంది.దాదాపు దశాబ్ద కాలంగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సత్తా చాటుతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.
‘హౌస్ ఫుల్’, ‘మర్డర్’, ‘రేస్’ వంటి సిరీస్ చిత్రాలతో బాగా పాపులరైన ఈ శ్రీలంకన్ బ్యూటీ గతేడాది ‘జుడ్వా-2’ తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక లేటెస్ట్‌గా ‘బాఘీ-2’లో ఏక్ దో తీన్ అంటూ మాధురీ దీక్షిత్ సూపర్ హిట్ సాంగ్‌లో మురిపించింది.ప్రస్తుతం స్టార్ హీరోలతో జత కడుతున్న ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు అవకాశాల కోసం తానెంతలా తపించిందో అప్పటి చీకటి రోజుల్లో తాను ఎలాంటి కష్టాలు అనుభవించిందో ఇటీవలే మీడియా సాక్షిగా బయటపెట్టింది ఈ సింహళ సుందరి…..
కెరీర్ స్టార్టింగ్ ఓ రెండు సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడిందట జాక్వెలిన్. ఆ సమయంలో ప్రతికూల ఆలోచనలతో తనలోని ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతినేదట. అలాంటి సమయంలో తనను ‘కిక్’ చిత్రం బాగా ఆదుకుందని తెలిపింది ఈ  భామ.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన ‘కిక్’ హీరో సల్మాన్ ఖాన్ తోనే ‘రేస్-3’లో నటిస్తుంది. ఏదిఏమైనా ప్రెజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నా జాక్వెలిన్ ఇంకా పాస్ట్‌ను ఏ మాత్రం మరచిపోలేదంటున్నారు ఆమె సన్నిహితులు.

కొత్త ఫ్యాషన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ ‘జస్ట్‌–ఎఫ్‌’ ఓనర్‌

మే 23 నుంచి భారతీయ యువతరం కొత్తగా మెరవబోతోంది! కొత్త ఫ్యాషన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ ‘జస్ట్‌–ఎఫ్‌’ ఆ రోజు నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉండబోతోంది! ఆ బ్రాండ్‌ ఓనర్‌ ఎవరో కాదు.. జాక్విలీన్‌ ఫెర్నాండెజ్‌! ‘యూత్‌’ అనగానే బాయ్స్‌ కూడా ఉంటారని అనుకోకండి. ఓన్లీ లేడీస్‌ కోసం జస్ట్‌–ఎఫ్‌ను తెస్తున్నారు జాక్వెలీన్‌. నాలుగు ‘ఎఫ్‌’లతో భారతీయ సంస్కృతిని కలవరపెడుతున్న ఈ శ్రీలంక సౌందర్యరాశి మొదట ‘ఫిల్మ్‌’ ఇండస్ట్రీతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ‘ఫుడ్‌’. ఆ తర్వాత ఫ్యాషన్‌. ఇప్పుడు ఫిట్‌నెస్‌. ఇందుకోసం ఆమె ప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘మోజోస్టార్‌’ తో కలిసి రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ‘‘ఎంపిక చేసుకున్న బ్రాండెడ్‌ లోదుస్తులు సరిపడనప్పుడు మహిళా క్రీడాకారిణులు పడే అవస్థలను నేను అర్థం చేసుకోగలను.

అయితే జస్ట్‌–ఎఫ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే దుస్తులు మహిళల మనసులనే కాదు, దేహాలనూ హత్తుకుపోయేలా ఉంటాయి’’ అని జాక్వెలీన్‌ చెబుతున్నారు. అలాగని స్పోర్స్‌  ఉమన్‌ పర్సనాలిటీలకు మాత్రమే ఆమె తన జస్ట్‌–ఎఫ్‌ను తెస్తున్నారని చింతించే పని లేదు. అమ్మాయిలందరికీనట. అయితే జాక్వెలీన్‌ ఇక్కడితో ఆగిపోవడం లేదు. త్వరలోనే ముంబైలో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నారు. ప్రారంభించడం అంటే రిబ్బన్‌ కట్‌ చెయ్యడం కాదు. తనే సొంతగా ఓపెన్‌ చెయ్యడం. ఇప్పటికే కొలంబోలో ఆమెకు ‘కామసూత్ర’ అనే సొంత ఫైన్‌–డైనింగ్‌ థీమ్‌ రెస్టారెంట్‌ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే, గత నెలలో విడుదలైన ‘బాఘీ 2’ చిత్రంలో ‘ఏక్‌ దో తీన్‌..’ రీమేక్‌ ఐటమ్‌ సాంగ్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జాక్వెలీన్‌ త్వరలో ‘రేస్‌ 3’ చిత్రంతో యూత్‌ని ఎట్రాక్ట్‌ చెయ్యబోతున్నారు.