జగపతి ని ‘పటేల్‌ సర్‌’ దెబ్బతీసాడు !

జగపతిబాబు హీరోగా ఒక వెలుగు వెలిగారు . జగపతి నటించిన తాజా చిత్రం ‘పటేల్‌ సర్‌’. ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించినప్పటికీ ఆ ప్రాజెక్టులో జగపతిబాబు కూడా డబ్బులు పెట్టారట. అలాగే ఈ సినిమాలో నటించినందుకు రెమ్యునరేషన్‌ కూడా తీసుకోలేదట. దీనికి కారణం కథపై ఉన్న నమ్మకమే. హాంకాంగ్‌ సినిమా ‘వెంజెన్స్’  ఆధారంగా ‘పటేల్‌ సర్‌’ సినిమాను తెరకెక్కించారు. అయితే అది తెలుగు ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో నచ్చ లేదు. సినిమా పెద్ద పరాజయం పాలైంది. దీంతో జగపతి బాబు బాగా నష్టాలను చవిచూశారట.

గతంలో జూదం వంటి కొన్ని అలవాట్ల వల్ల డబ్బు పోగొట్టుకుని అప్పులపాలయ్యారు జగపతిబాబు. అయితే విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారడంతో ఆయనకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ అగ్రహీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నారు జగపతి. ఈ సమయం లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని చేసిన ‘పటేల్‌ సర్‌’ ప్రయత్నం దెబ్బకొట్టింది