విజయ్‌ జోడీగా జాన్వీ క‌పూర్ కు భారీ పారితోషికం

దివంగ‌త బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి త‌న‌య బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ద‌క్షిణాదిన తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్‌ దేవరకొండకు ‘అర్జున్‌రెడ్డి’తో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడితే… దర్శకుడు పూరి జగన్నాథ్‌ చిత్రాలకూ హిందీలో సహా..ఇతర భాషల్లోనూ అభిమానులు ఉన్నారు.హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా ‘బుడ్డా హోగా తెరా బాప్‌’కు దర్శకత్వం చేసారు పూరి. తను తీసిన పలు చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్‌.. డబ్ అయ్యాయి. వీరిద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫైటర్‌’. ‘పాన్‌ ఇండియన్‌’ కథ కావడంతో హిందీ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా మారారు. పూరి, ఛార్మితో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభించనున్నారని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం..మొత్తం ఐదు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తారు.
 
దివంగ‌త బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి త‌న‌య బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ద‌క్షిణాదిన తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆయ‌న చొర‌వ తీసుకోవ‌డంతో ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ని స‌మాచారం. గతంలో జాన్వీ.. ‘సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే తనకు ఇష్ట’మని చెప్పిన విషయం తెలిసిందే. జాన్వీ ఫిబ్ర‌వ‌రి నుండి యూనిట్‌తో జాయిన‌వుతుంద‌ని తెలిసింది..ఈ చిత్రానికి ఆమె పారితోషికం మూడున్నర కోట్లని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ‘ఫైటర్‌’ తో విజయ్‌ దేవరకొండ బాలీవుడ్ లో…జాన్వీ క‌పూర్ టాలీవుడ్లో ప్రవేశిస్తున్నారు
 
నా వివాహం తిరుపతిలో జరుగుతుంది!
జాన్వీ తాజాగా ‘బ్రైడ్స్‌ టుడే’కిచ్చిన ఇంటర్వ్యూలో … శ్రీదేవి ఉన్నప్పుడు మీ పెళ్లి గురించి చర్చించేవారా? అని ప్రశ్నిస్తే .. “దీని గురించి మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే మా అమ్మకు నా మీద నమ్మకం తక్కువ. నేను త్వరగా ప్రేమలో పడతానని తన అభిప్రాయం. నా జడ్జిమెంట్‌ మీద అమ్మకు నమ్మకం లేదు కాబట్టి నా కోసం తనే ఓ అబ్బాయిని చూస్తానని చెప్పేది’ అన్నారు జాన్వీ.
 
చేసుకోబోయే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాల గురించి ప్రశ్నిస్తే.. “చేసే పని పట్ల తనకు శ్రద్ధ, నిబద్ధత ఉండాలి. తన నుంచి నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలి. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉండాలి. నేనేంటే పడి చచ్చిపోవాలని’ చెప్పుకొచ్చారు.
 
పెళ్లి ఎలా జరగాలని కోరుకుంటున్నారని ప్రశ్నిస్తే.. ‘అట్టహసంగా, వైభవంగా జరిగే వేడుకలకు నేను దూరం. అందుకే నా వివాహం చాలా సాంప్రదాయబద్ధంగా తిరుపతిలో జరుగుతుంది. పెళ్లిలో నేను కంజీవరం జరీ చీర కడతాను.. వివాహం తర్వాత నాకు ఇష్టమైన దక్షిణ భారత వంటకాలతో బ్రహ్మండమైన దావత్‌ ఉంటుంది. దానిలో ఇడ్లీ, సాంబార్‌, పెరుగన్నం, పాయసం వంటివి ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్‌.