ప్రపంచ బాక్సాఫీసును షేక్ చేస్తున్న‘జోకర్’

జాక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో ప్రపంచ సినిమా బాక్సాఫీసును ‘జోకర్’ షేక్ చేస్తోంది. ఈ సినిమా అరుదైన ఘనతను సాధించింది.అక్టోబర్ 2న విడుదలై భారీ వసూళ్లతో బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.71,63,50,00,000 కోట్లు) వసూలు చేసిన మొట్టమొదటి చిత్రంగా ఆర్-రేట్‌ను సాధించింది. ఈ చిత్రం భారతదేశంలో కూడా అధిక వసూళ్లను సాధించింది.
వార్నర్ బ్రదర్స్, డీసీ ఫిల్మ్ సంయుక్త నిర్మించిన ఈ చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘గోల్డెన్ లయన్’ బహుమతి గెలుచుకుంది. 785 మిలియన్ డాలర్లు సాధించిన ర్యాన్ రేడోల్స్ ‘డెడ్‌పూల్-2’ చిత్రం రికార్డును బద్దలు కొట్టి.. బిలియన్ డాలర్లు సంపాదించి తొలి చిత్రంగా నిలిచింది.ప్రధాన పాత్రధారి జాక్విన్ ఫీనిక్స్.. ‘జోకర్’ గా అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు వచ్చాయి .
‘జోకర్’ చిత్రానికి వివాదస్పద చిత్రాల దర్శకుడయిన టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే ఈ చిత్రం పెద్ద దుమారం లేపింది. సినిమాలోని కంటెంట్ హింసాత్మకంగా ఉందంటూ సినిమాపై విమర్శలు వచ్చాయి. ‘జోకర్’ హింసాత్మక చిత్రమని..దీని విడుదలకు అనుమతించవద్దని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే చిత్ర బృందం విమర్శలను స్వాగతించి…చిత్రంలోని అంశాల గురించి వివరించే ప్రయత్నం చేసింది. ఈతరహా ప్రతికూలతలను అధిగమించి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసును ఓ ఊపు ఊపేసింది.