రవితేజ ఆవిష్కరించిన ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ ఫస్ట్ లుక్

జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జోన్నలగడ్డ హీరోగా పరిచయం చేస్తూ.. ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ”ప్రేమెంత పని చేసే నారాయణ” ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ కి రెడీ అయ్యింది.. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మాస్ మహారాజ రవితేజ ఆవిష్కరించారు..
ఈ సందర్భంలో హీరో రవితేజ మాట్లాడుతూ…ఈ సినిమా హీరో హరి చాలా బాగా డాన్స్ లు చేశాడు..డైలాగ్ డెలివరీ బాగుంది.. అతనికి అతని హైటు ప్లస్. ఈ సినిమా పాటలు, ట్రైలర్ మరియు కొన్ని సీన్స్ చూశాను, హరి చాలా బాగా నటించాడు. అతను భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి తప్పకుండా వెళ్తాడు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ రావుతో నాకు మంచి అనుబంధం ఉంది..అతనికి ఈ సినిమా మంచి విజయంతో పాటు డబ్బులు కూడా తెస్తుంది అనే నమ్మకం ఉంది.. సినిమా చాలా రిచ్ గా ఉంది.. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అని అన్నారు..
చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాకు ఎంతో ఇష్టమైన హీరో రవితేజ, మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం.. చాలా ఆనందంగా ఉంది.. ఈ సినిమాలో కొన్ని పాటలు, కొన్ని సన్నివేశాలు రవితేజ గారికి చూపించడం జరిగింది. మా అబ్బాయి హరిని రవితేజ గారు అభినందించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.. సినిమా మొత్తం పూర్తి అయ్యింది. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేయనున్నాం.. ఈ నెల చివరి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.. ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.తప్పకుండా ఈ సినీమా  ఘనవిజయం సాధిస్తుంది అని అన్నారు..
హీరో హరి మాట్లాడుతూ.. నేను హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రవితేజ గారు రిలీజ్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి.. సినిమా బాగా వచ్చింది.. డాన్స్ పరంగా, నటన పరంగా రవితేజ గారు నన్ను మెచ్చుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది.. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది.. త్వరలోనే ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను.. ప్రేక్షకులు నా ప్రయత్నాన్ని మెచ్చి నన్ను దీవిస్తారు అని ఆశిస్తున్నాను అని అన్నారు..
హరికృష్ణ జొన్నలగడ్డ, ( తొలిపరిచయం), అక్షిత, ఝాన్సి, చిలుకూరి గంగారావు, ఏఆర్ సి బాబు, రాహుల్ బొకాడియ, పింగ్ పాంగ్, రాఘవ పూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : జె ఎస్ ఆర్ మూవీస్, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, సంగీతం:యాజమాన్య, పాటలు: వనమాలి, గోసల రాంబాబు, ఎడిటర్: జానకీ రామ్, కో-డైరక్టర్ : వి.సిప్పి, కెమెరా: పి. ఎస్ వంశీ ప్రకాశ్, స్ట్రంట్స్: రామ సుంకర, కొరియోగ్రఫి:ప్రేమ్ రక్షిత్, విద్యా సాగర్, నిర్మాత: సావిత్రి జొన్నలగడ్డ, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం:జొన్నల గడ్డ శ్రీనివాసరావు.