కె.వి.రెడ్డి పురస్కారం అందుకున్న ‘సైరా’ సురేందర్ రెడ్డి

‘జగదేక దర్శకుడు’ కె వి రెడ్డి చలనచిత్ర దర్శక పురస్కారం ‘సైరా’ దర్శకులు పి. సురేందర్ రెడ్డికి డా.కె.రాఘవేంద్ర రావు గారు ప్రదానం చేశారు.’యువకళావాహిని’-‘సాంస్కృతికబంధు’ సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ నిర్వహణలో అక్టోబర్ 15వ తేదీన ప్రసాద్ ఫిలిం లాబ్ ప్రివ్యూ థియేటర్లో కన్నులపండుగగా నిర్వహించిన కార్యక్రమంలో… తొలుత అక్కినేని రమేష్ ప్రసాద్ గారు కె వి రెడ్డి గారి చిత్ర పటానికి పుష్పమాలవేయగా,డా.కె.రాఘవేంద్రరావు గారు మిగిలిన అతిథులు జ్యోతి ప్రకాశనం చేసారు.’సాంస్కృతికబంధు’ సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ సభలో విశిష్ట అతిథిగా డా.యస్. వేణుగోపాలాచారి,గౌరవ అతిథులుగా పరుచూరి వెంకటేశ్వరరావు, బుర్రాసాయి మాధవ్, డా. వోలేటి పార్వతీశం, డి.సురేష్ కుమార్, ‘సంతోషం’ సురేష్ కొండేటి పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు నాగేంద్ర కుమార్, యస్. వి. రామారావు అభినందనలు తెలిపారు.కె వి రెడ్డి పేరిట నెలకొల్పిన అవార్డును పి.సురేందర్ రెడ్డికి ఇవ్వడం సముచితంగా ఉందని వక్తలు పేర్కొన్నారు.
నటి చిత్రలేఖ వ్యాఖ్యానంచేయగా.. భాగి శాస్త్రి ప్రార్ధనా గీతం ఆలపించారు. గురు చందుప్రియ సారధ్యంలో చిన్నారులు శాస్త్రీయ నృత్యాంశాలు ప్రదర్శించారు.అనేకమంది అభిమానులు పి.సురేందర్ రెడ్డి ని అభినందనలు అందించారు. లయన్ వై.కె.నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ పురస్కార సభ రసరమ్యంగా జరిగింది.