విమర్శలను ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు !

పొగడ్తలను స్వీకరించడమే కాదు.. విమర్శలను ఎలా తీసుకోవాలో కూడా బాగా తెలుసు’’ అని అంటోంది కాజల్‌. ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండే విమర్శల మీద కాజల్‌ స్పందించారు…. ‘‘విమర్శ ఎక్కడ ఉండదు చెప్పండి? మనం ఏం చేసినా విమర్శించేవారు నీడలాగా ఉంటారు. చాలా సందర్భాల్లో అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ‘అలా ఉంటే బావుండేదేమో, ఇలా ఉండాల్సిందేమో’ అనుకుంటుంటాం. మన గురించి మనం అనుకుంటే తప్పు కాదు. కానీ మరొకరు చెబితే ఎక్కడిలేని రోషం వచ్చేస్తుంది. దీని అర్థం ఏంటంటే… విమర్శను మనం ఎలా స్వీకరిస్తాం అనేదాన్ని బట్టి మన తదుపరి చర్యలు, ఆలోచనలు ఆధారపడి ఉంటాయన్నమాట. సినిమాలకు ఒకరు, ఈవెంట్స్‌కి వెళ్లేటప్పుడు మరొకరు, టీవీ కమర్షియల్స్‌కు మరొకరు నాకు డ్రస్‌ డిజైన్‌ చేస్తుంటారు. వెళ్లిన ప్రతిచోటా నన్నూ, నా డ్రెస్సింగ్‌ను అందరూ మెచ్చుకోవాలని నేను కోరుకోను. ఒకవేళ ఎవరైనా విమర్శించినా పట్టించుకోను. ఆ సంగతి మావాళ్లు చూసుకుంటారు. అలాంటి విషయాలకు విలువిచ్చే తీరిక నాకెక్కడిది? నిజంగా వాటిని గురించి రోజుల తరబడి ఆలోచిస్తే నా రొటీన్‌ డిస్టర్బ్‌ అయిపోతుంది. అందుకే పొగడ్తలను స్వీకరించడమే కాదు.. విమర్శలను ఎలా తీసుకోవాలో కూడా బాగా తెలుసు’’ అని అన్నారు కాజల్‌.

దాదాపు ప‌దేళ్ల నుంచీ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. తెలుగులో దాదాపు అగ్ర‌హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించింది. అలాగే చిరంజీవి వంటి సీనియ‌ర్ హీరోతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. మ‌రోవైపు త‌మిళంలోనూ స‌త్తా చాటుతోంది. ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఆమె జోరు ఇంకా త‌గ్గ‌లేదు.2018లో ఆమె మ‌రింత బిజీ కాబోతోంది. మొద‌టి సినిమా చేసిన క‌ల్యాణ్‌రామ్‌తో మ‌రోసారి కాజ‌ల్ జ‌త‌కట్టింది. ‘ఎమ్ఎల్ఏ’ (మంచి ల‌క్షణాలున్న అబ్బాయి) సినిమాలో క‌ల్యాణ్‌రామ్ స‌ర‌స‌న న‌టిస్తోంది.అలాగే త‌మిళ `క్వీన్‌` రీమేక్‌లోనూ న‌టిస్తోంది. దీని త‌ర్వాత సుధీర్ వ‌ర్మ‌, శ‌ర్వానంద్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలోనూ చాన్స్ కొట్టేసింది. మ‌రోవైపు వెంక‌టేష్‌, తేజ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాకూ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చే చాన్స్ ఉంది. అలాగే త‌మిళం నుంచి కూడా కాజ‌ల్‌కు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి