సక్సెస్ చూసి మళ్ళీ పెంచేస్తానంటోంది !

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న భామ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ్‌లో టాప్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. ఈ భామ ఈమధ్యన ఇప్పటికే ఓసారి తన రెమ్యునరేషన్‌ను పెంచింది. ప్రస్తుతం తమిళనాట సినిమాకు ఒక కోటి యాభై లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటోంది. ఇప్పుడు ఈ పారితోషికాన్ని మరోసారి పెంచే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం ఆమె చేసిన రెండు తమిళ్ సినిమాలు విడుదలైన తర్వాత తన పారి తోషికాన్ని సవరించడానికి సిద్ధమవుతోంది కాజల్.

కోలీవుడ్‌లో స్టార్ హీరో అజిత్ సరసన ‘వివేగమ్’ సినిమా చేసింది కాజల్.ఈ చిత్రం తెలుగులో ‘వివేకం’ పేరుతో వస్తోంది. ఈనెల 24న ఈ సినిమా విడుదలకానుంది. తమిళ్‌లో మరో స్టార్ హీరో విజయ్ సరసన ‘మెర్సెల్’ సినిమాలో నటిస్తోంది ఈ భామ. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ రెండు సినిమాల ఫలితాలను చూసిన తర్వాత మరోసారి తన పారితోషికాన్ని పెంచాలని భావిస్తోందట కాజల్ అగర్వాల్. అయితే కాజల్  తెలుగులో కాస్త తక్కువ రెమ్యునరేషన్‌కే సినిమాలు చేస్తోంది.   తాజాగా కళ్యాణ్‌రామ్‌తో చేస్తున్న సినిమాకు కోటి కంటే తక్కువ మొత్తానికే ఆమె డేట్స్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు సినిమా లేదు. అయితే రానా సరసన ఆమె చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ అయ్యింది. అందు వల్ల ఇక్కడ పెంచే విషయం కూడా సీరియస్ గా ఆలోచిస్తోంది