నా వయసు పదేళ్లు ఎక్కువ చెప్పడానికైనా రెడీ !

కాజల్‌ అగర్వాల్‌… ఏ రంగంలోనైనా మహిళలను మీ వయసు ఎంత? అని అడిగితే చెప్పడానికి సందేహిస్తారు. ముఖ్యంగా కథానాయికలు అసలు చెప్పరు. అయితే తాను అలా కాదని, తన వయసును దాచనని చెబుతోంది…. కాజల్‌ అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో. సినిమాల్లో తక్కువ వయసుగా కనిపించడానికి కథానాయికలు చాలా కష్టపడుతుంటారని చెప్పారు. తన వయసు పెరుగుతోందని చింతించనని, అది పెరిగిన కొద్దీ పరిణితి చెందుతుందని చెప్పింది.
 
నిజ జీవితంలో తన వయసును 10 ఏళ్లు ఎక్కువ చెప్పడానికి కూడా రెడీ అని అంది. ప్రతిభావంతులైన నటులతో నటించి, చాలా నేర్చుకున్నానని, నటిగా పదేళ్లలో సినిమా రంగం తనకు చాలా నేర్పిందని, ఇతర ఏరంగంలోనూ అంత అనుభవం రాదని అంది. ఇంకా చెప్పాలంటే.. ఈ పదేళ్లతో 30 ఏళ్ల అనుభవాన్ని పొందానని, ఎలాంటి సమస్య వచ్చినా, పరిష్కరించగలిగే పరిపక్వత వచ్చింది.
 
‘పదేళ్లు గడిచాయి’ అని నాకు అనిపించడం లేదు. గ్రేట్‌ రన్‌. నేను చాలా ‘బ్లెస్డ్‌’ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదు. నన్ను తెలుగుమ్మాయిగా స్వీకరించిన నా ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు. అఫ్‌కోర్స్‌ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలను మరచిపోకూడదు.
 
బ్రేక్‌ వస్తుందని భయపడిన సందర్భం ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే… ఒక సినిమా కంప్లీట్‌ అయ్యేసరికి ఇంకో సినిమా చేతిలో ఉండేది. ఒక్కోసారి రెండు మూడు సినిమాలు ఉండేవి. అయితే నా చెల్లెలు నిషా పెళ్లి కోసం బ్రేక్‌ తీసుకున్నాను. అక్కగా అన్నీ దగ్గరుండి చేయాలి కాబట్టి నెల రోజులు షూటింగ్స్‌కి ఎటెండ్‌ కాలేదు.