వాళ్లలో నాకు లైఫ్‌ పార్టనర్‌ కనిపించలేదు !

కాజల్ అగర్వాల్… “ఇండస్ట్రీ వాళ్లలో నాకు లైఫ్‌ పార్టనర్‌ కనిపించలేదు”…. అని అంటోంది అందాల హీరొయిన్ల కాజల్ అగర్వాల్.  నచ్చిన అబ్బాయి దొరికితే ఓకే. లేకపోతే అరేంజ్డ్‌ మ్యారేజ్‌ చేసుకుంటా. ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడంలేదు.ఇండస్ట్రీలో వాళ్లను చేసుకోకూడదని కాదు. ఒకవేళ ఎవరైనా నచ్చితే తప్పకుండా చేసుకుంటా. ఇండస్ట్రీలో అందరూ నాకు తెలుసు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్లలో నాకు లైఫ్‌ పార్టనర్‌ కనిపించలేదు. అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవర్నీ పెళ్లాడను అన్నాను.
ఆ సినిమాలు నాకు బాగా ఇష్టం !
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోయే ముందు..  క్వాలిటీ సినిమాలు చేయాలనుకున్నాను. కెరీర్‌లో చెప్పుకోవడానికి ఓ 5 సినిమాలుంటే చాలనుకున్నా. ఆ సినిమాల గురించి ఎప్పుడు అనుకున్నా గర్వంగా అనిపించాలి. ‘మగధీర, నేనే రాజు నేనే మంత్రి, మిస్టర్‌ పర్ఫెక్ట్, వివేగమ్‌ (తమిళం), అ!’ సినిమాలు నాకు బాగా ఇష్టం. ‘అ!’లో నాది చిన్న రోల్‌ కానీ.. చాలా ఇంపాక్ట్‌ ఉంటుంది. ఇప్పుడు తేజాగారితో ఓ సినిమా చేస్తున్నాను. అందులో నాది అద్భుతమైన పాత్ర. నేను గర్వంగా చెప్పుకునే సినిమాలలో ఇది కూడా ఉంటుంది.
ఆవిడ పాత్ర చేయాలని ఉంది !
ఇండియన్‌ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఝాన్సీ లక్ష్మీభాయ్‌ అంటే ఇష్టం. ఆమె భయం లేని గుణం, ఆత్మవిశ్వాసం గురించి మనందరం చదువుకున్నాం. స్క్రీన్‌ మీద ఆవిడ పాత్ర చేయాలని ఉంది.ఝాన్సీ లక్ష్మీభాయ్‌ అంత ధైర్యం లేకపోయినా నేనూ కొంతవరకూ ధైర్యవంతురాలినే. కొన్నిసార్లు లక్ష్మీభాయ్‌ అవ్వాల్సి వస్తుంది కూడా. ఇక ఆ సమయంలో చుట్టు పక్కలవారి గురించి, పరిసరాల గురించి పట్టించుకోను కూడా. కొన్నిసార్లు సౌమ్యంగా, కొన్నిసార్లు సింహంలా, కాళీ మాతలా మారాల్సి ఉంటుంది.