ఆమె కెరీర్‌లోనే ఇదొక ఛాలెంజింగ్‌ సినిమా!

“కాజల్‌ కెరీర్‌లోనే ఇదొక ఛాలెంజింగ్‌ సినిమా” అని చెప్పారు నిర్మాత డి.సురేష్‌బాబు. కొరియన్‌ చిత్రం ‘డాన్సింగ్‌ క్వీన్‌’ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ రీమేక్‌ చేయబోతోంది. ఈ చిత్రంలో కాజల్‌ నటిస్తుందనే వార్తలు సోషల్‌ మీడియాలో వచ్చాయి.
‘తొలిసారి నా కెరీర్‌లో పూర్తి స్థాయి డాన్స్‌ నేపథ్య చిత్రంలో నటిస్తున్నా. నృత్య ప్రధాన క్యారెక్టర్‌ చేయడం అంత ఈజీ కాదు. నటనతోపాటు డాన్స్‌తోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దీని కోసం డాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా’ అని చెప్పింది కాజల్ .
‘డాన్స్‌ నేపథ్యంలో జరిగే ఓ జంట కథ ఇది. తమ జీవితాల్లో ఎదురైన సమస్యల్ని ఎదుర్కొని లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారనేది? సినిమా. ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది. ఈ రీమేక్‌లో నటించడానికి కాజల్‌ అంగీకరించడం సంతోషంగా ఉంది. ఆమె కెరీర్‌లోనే ఇదొక ఛాలెంజింగ్‌ సినిమా’ అని చెప్పారు సురేష్‌బాబు స్పందిస్తూ.
కాజల్‌ జాన్‌ అబ్రహం సరసన ‘ముంబాయి సాగా’ హింది చిత్రం, తెలుగులో ‘మోసగాళ్ళు’, తమిళంలో ‘హే సినమికా’, ‘ఇండియన్‌ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 
నేను వాడిన ఆల్కహాల్ చాలా ఎక్కువ
గత మూడు రోజుల్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా ఆల్కహాల్ చాలా ఎక్కువగా తన చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడానని హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయం నెలకొన్న నేపథ్యంలో ఆమె సరదాగా అలా ట్వీట్ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చాలామంది ఆల్కహాల్ అధికంగా ఉండే హ్యాండ్ శానిటైజర్స్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చేతులు కడుక్కోవడానికి వినియోగిస్తోన్న ఆల్కహాల్‌ గురించి కాజల్‌ అలా చమత్కరించింది.