ఏకాంతంగా మాట్లాడ్డానికి రమ్మన్నారు !

కాజల్‌ అగర్వాల్‌… హీరోయిన్లు ఒక్కోసారి అవమానాలను, మనోవేదనలను ఎదుర్కొంటుంటారు. అయితే కొందరు చెప్పుకుంటారు, మరి కొందరు పరువు ప్రతిష్టలకు భంగం అని మనసులోనే దిగమింగుకుంటారు. నటి కాజల్‌అగర్వాల్‌ అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొందట. ఈ బ్యూటీ భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. బహుభాషా నటి కావడంతో  ఎక్కువ ప్రయాణం చేయడం తప్పనిసరి. అలా ప్రయాణిస్తున్న సమయంలో ముంబై విమానాశ్రయంలో ఈ అమ్మడికి ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురైందట.

ఈ సంఘటన గురించి కాజల్‌అగర్వాల్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ… ఇటీవల ముంబై విమానాశ్రయానికి ఉదయం వెళ్లానని చెప్పింది. అప్పుడు అక్కడి నిర్వాహకం ఏర్పాటు చేసిన కౌంటర్‌కు వెళ్లగా ఆ కౌంటర్‌లో ఉన్న ఒక మహిళ తనను అనవసరంగా విసిగించిందని చెప్పింది. తాను విమానం బయలుదేరడానికి 75 నిమిషాల ముందే విమానాశ్రయానికి వెళ్లినా అనవసర ప్రశ్నలతో అవమానపరిచే విధంగా ప్రవర్తించి, ఆ తరువాత వెళ్లమని చెప్పిందని తెలిపింది. అయితే గంట సమయం ఉన్నా విమానంలోకి వెళ్లే దారిని మూసివేశారని చెప్పింది. విమానంలోకి వెళ్లడానికి అరగంట సమయం పట్టేంత దూరంలో తనను నిలిపేశారని అంది. ఇలా పలు అవమానాలు, కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపింది. దీని గురించి విమాన సంస్థ నిర్వాహకులకు ఫిర్యాదు చేయబోగా… అక్కడి అధికారులు ఏకాంతంగా మాట్లాడడానికి రమ్మన్నారని… వారితో మాట్లాడడం తనకు ఇష్టం లేక వారికి సమయాన్ని కేటాయించలేదని కాజల్‌అగర్వాల్‌ పేర్కొంది.

నా కెరీర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లిన ఫీలింగ్‌ !

కాజల్‌ ఇటీవల ‘ఇండియన్‌ 2’ సినిమాకు సైన్‌ చేసిన సంగతి తెలిసిందే. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా రూపొందనున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికిది సీక్వెల్‌.ఈ సినిమాలో చాన్స్‌ రావడం గురించి కాజల్‌ మాట్లాడుతూ–

‘‘భారతీయుడు2’ చిత్రంలో నా భాగస్వామ్యం ఉండబోతున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమాలోని నా పాత్ర కోసం నేర్చుకోవాల్సిన కొత్త స్కిల్స్‌ పట్ల ఎగ్జై టింగ్‌గా ఉన్నాను. ఈ సినిమాకు సైన్‌ చేయడంతో నా కెరీర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లిన ఫీలింగ్‌ కలుగుతోంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘అందరి యాక్టర్స్‌లాగానే నా కెరీర్‌లో కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ ‘మగధీర’ సినిమాకు సైన్‌ చేసిన తర్వాత నా గోల్డెన్‌టైమ్‌ స్టార్ట్‌ అయ్యింది.ఆ సినిమా నా కెరీర్‌కు బాగా ప్లస్‌ అయ్యింది. ఆ సినిమా వల్ల నాకు లభించిన గుర్తింపును ఇప్పటికీ ఎంజాయ్‌ చేస్తున్నాను’’ అన్నారు.

బెల్లంకొండసాయి సాయి శ్రీనివాస్‌ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాజల్‌ తమిళంలో నటించిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీ వుడ్‌ ‘క్వీన్‌’ చిత్రానికిది రీమేక్‌.