నా వ్యక్తిగత జీవితం.. వృత్తి.. విడివిడిగానే !

కాజల్‌ అగర్వాల్, కిచ్లూ జంట మాల్దీవులలో హానీమూన్‌ను ముగించుకొచ్చారు. ఇప్పుడు కాజల్‌ తన చిత్రాల షూటింగ్‌పై దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’, మంచు విష్ణు చిత్రం ‘మోసగాళ్లు’లో నటిస్తున్నారు. తమిళంలో కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబోలో ‘ఇండియన్‌ 2’లో, బాలీవుడ్‌లో ‘ముంబై సాగా’ చిత్రంలో, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామికా’లోనూ కథానాయికగా కాజల్‌ నటిస్తున్నారు. ఇప్పటికే బిజీగా ఉన్న కాజల్‌ తాజాగా మరో తమిళ హారర్‌ చిత్రాన్ని అంగీకరించారు.

హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన కాజల్‌ ఇన్నేళ్లలో ఓ హారర్‌ మూవీలోనూ నటించలేదు. తొలిసారి ఓ హారర్‌ మూవీలో నటించడానికి ఓకే చెప్పింది. ఈ చిత్రానికి డీకే దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కావలై వేందామ్‌’ వచ్చింది. ఆయన చెప్పిన కథ నచ్చడంతో కాజల్‌ వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారట. కొత్త చిత్రం కోసం చెన్నైలో జరిగిన ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను దర్శకుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తను మల్టీస్టారర్‌ చిత్రంలో నటిస్తున్నట్టు కాజల్‌ చెప్పారు. ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే.. ఈ చిత్రంలో కాజ‌ల్ తో మ‌రో ముగ్గురు హీరోయిన్లు కీ రోల్స్ పోషిస్తున్నారు ‌.మిగిలిన ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రనేది త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

# చాలా లక్కీ అనుకుంటున్నా! 
గౌతమ్‌ చాలా మంచి అబ్బాయి. మంచి మనసు ఉన్నవాడు. అందర్నీ గౌరవిస్తాడు. అర్థం చేసుకోగలడు. ఇలాంటి అబ్బాయి నాకు దొరకడం చాలా లక్కీ అనుకుంటున్నాను. ఒక వ్యక్తిగా, నటిగా నా ఎదుగుదలను చూస్తూ వచ్చాడు గౌతమ్‌. నా అప్స్‌ అండ్‌ డౌన్స్‌ చూశాడు. యాక్టర్‌ కాజల్‌ కంటే కూడా తనకి సాధారణ కాజలే బాగా తెలుసు. అదే బెస్ట్‌ విషయం. మా ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉందంటే.. నా జీవితాన్ని గౌతమ్‌తో తప్ప ఎవ్వరితోనూ ఊహించుకోలేకపోయాను.

ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తా !
నేను మొదటి నుంచి మంచి పాత్రలు, మంచి సినిమాలే ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తాను. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని విడివిడిగానే ఉంచాను. అవి ఎప్పుడూ అలానే ఉండాలని కూడా అనుకుంటాను. ఈ రెండిట్లో ఏదీ కూడా రెండోదాన్ని ప్రభావితం చేయకూడదు. పని చేస్తే దానికి 100 పర్సంట్‌ ఇవ్వాలి. అలాగే పర్శనల్‌ లైఫే ఫస్ట్‌ ప్రయారిటీ అవ్వాలన్నది నా అభిప్రాయం.

#చాలా అంటే చాలా బిజీ వర్క్‌ !
ఆచార్య, భారతీయుడు 2, మోసగాళ్ళు, దుల్కర్‌తో సినామికా, వెబ్‌ సిరీస్‌ ‘టెలికాస్ట్‌’ ఉన్నాయి. షూటింగ్స్‌లో జాయిన్‌ అయితే.. చాలా అంటే చాలా బిజీ వర్క్‌ ఉంది.