అతనితో చెయ్యాలనే నా కల నెరవేరాలి!

కాజల్ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. అగ్ర హీరోలందరితో ఆమె జోడీ కట్టారు. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ కాంబినేషన్ లో ‘ఇండియన్-2’ (భారతీయుడు2) లో నటిస్తోంది. కోలీవుడ్ లో అజిత్, విజయ్ వంటి పెద్ద హీరోలతో కలిసి నటించానని… కమల్ కు జోడీగా చేస్తున్నానని ఆమె పేర్కొంది. అయితే ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ కు జోడీగా ఇప్పటివరకు నటించలేదని… అతనితో నటించాలనే తన కల ఇంకా నెరవేరలేదని కాజల్ చెప్పింది. త్వరలో ‘రజనీ సర్’ సరసన నటించేందుకు అవకాశం వస్తుందనే ఆశ పడుతున్నానని అంటోంది. కాజల్ ఆశ నెరవేరాలని ఆమె అభిమానులు చెబుతున్నారు.
 
బయోపిక్‌ చిత్రాల గురించి…
బయోపిక్‌ చిత్రాలు మనకు అవసరమే. నాకు రాజకీయనాయకులు.. క్రీడాకారుల బయోపిక్‌ల్లో నటించాలన్న ఆశ ఉంది. నాకు రాజకీయాలు తెలియవు…స్పోర్ట్స్‌ ప్లేయర్‌నూ కాను. అందువల్ల.. ‘ఇలాంటి బయోపిక్‌ల్లో నటించడం నాకు నేనే చేసుకునే సవాల్‌’ అవుతుంది
 
సినిమారంగంలో స్నేహితులు…
సమంత, నయనతార, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌తో.. నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా నేను నటించే హీరోలందరితోనూ స్నేహంగా, సన్నిహితంగా మాట్లాడతాను. నిజానికి నాకు స్నేహితులంటే పాఠశాలలో నాతో చదివిన వారే. వారే నా సంతోషం.. దుఖం.. కోపం అంతా…
 
గాసిప్స్ రాకపోవడం గురించి…
రహస్యం అంటూ ఏమీ లేదు. షూటింగ్‌ కాగానే తిన్నగా రూమ్‌కు పోయి.. భోజనం చేసి.. నిద్రపోతాను. నాకు ఫ్రెండ్స్‌ కూడా చాలా తక్కువే. సినిమాలకు చెందిన వారితో డిన్నర్, పార్టీలకు వెళ్లను. పార్టీలకు వెళ్లితే అది.. ముంబైలోని నా స్కూల్, కాలేజ్‌ ఫ్రెండ్స్‌తోనే.