నటనకు ఆస్కారం.. ప్రేక్షకులకు వినోదం.. రెండూ ఉండాలి !

కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లుని పెళ్ళాడి సడెన్ షాకిచ్చి.. పెళ్లైన వెంటనే  రొమాంటిక్ టూర్స్ తో కొంత కాలం ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత తాను పెళ్లికి ముందు కమిటైన సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసే పనిలో పడింది. అయితే ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక కాజల్.. మరే సినిమా అంగీకరించదేమో అని అంతా అనుకుంటున్న తరుణంలో వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తోంది కాజల్. కాజల్ నిన్నటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే చేసినా..  ఈమధ్య కాస్త తన పంథా మార్చింది. ఆల్రెడీ ఓటీటీలో హారర్ సిరీస్ చేసిన కాజల్ ఈసారి మరింత థ్రిల్ అందిస్తానంటోంది. అది కూడా ఓటీటీలో కాదు.. ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై. రీసెంట్ గా ఓ ఫిమేల్ ఓరియంటెడ్ కథకు ఓకే చెప్పింది కాజల్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో కథతో పాటు కాజల్ లుక్ కూడా కొత్తగా ఉండబోతోంది. పెళ్లి తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలకు ప్రాధాన్యమిస్తోంది కాజల్‌.

‘ఉమ’ ఆ కోవకు చెందినదే!… మహిళా ప్రధాన ఇతివృత్తాలు, చాలెంజింగ్‌ రోల్స్‌పై దృష్టి సారిస్తున్న ఆమె తాజాగా బాలీవుడ్‌లో ‘ఉమ’ అనే ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తథాగథ సింఘా దర్శకత్వం వహిస్తున్నారు. రాజవంశానికి చెందిన కుటుంబంలో జరిగే వివాహ వేడుక నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకలోకి అపరిచితురాలైన ఉమ అనే యువతి రంగప్రవేశంతో ఏం జరిగిందనే కథాంశంతో ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. నటనాపరంగా చాలెంజింగ్‌గా నిలుస్తూనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథలకు తాను ప్రాముఖ్యతనిస్తానని, ‘ఉమ’ ఆ కోవకు చెందిన సినిమాయేనని కాజల్‌ అగర్వాల్‌ తెలిపింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ లో అడుగుపెట్టడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కాజల్‌ వెల్లడించింది. అవిషేక్‌ ఘోష్‌, మంత్రారాజ్‌ పలివాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగార్జున సినిమాలో సంచలన పాత్ర!… కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం తెలుగులో ‘ఆచార్య’తో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది .అయితే నాగార్జున సినిమాలో ఆమె ఒక సంచలన పాత్ర చేస్తోంది కాజల్‌ అగర్వాల్‌. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ ఒక స్పై పాత్రలో నటిస్తుంది. అలాగే చేస్తున్న పాత్ర వేశ్య అని తెలుస్తోంది. తీవ్రవాదుల గుట్టు రట్టు చేయడానికి తన అందచందాలతో వాళ్లను ఆకట్టుకుంటూ.. వాళ్ళతో రొమాన్స్ చేస్తూ అక్కడి రహస్యాలను తన డిపార్ట్మెంట్ కు అందజేసే పాత్ర ఇది. ఒకవైపు గూడచారి, మరోవైపు వేశ్య ఈ రెండూ కలగలిపి ఉన్న పాత్రను కాజల్ అద్భుతంగా పోషిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో సూపర్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కాజల్ నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా తన కెరీర్లో ఇదొక చాలెంజింగ్ రోల్ అవుతుంది అంటూ నమ్మకంగా చెబుతుంది చందమామ. ఏదేమైమా కూడా పెళ్లి తర్వాత ఇంతటి చాలెంజింగ్ పాత్ర చేస్తుండడం ఒకరకంగా సాహసమే.

జయశంకర్‌ వెబ్‌ ఫిల్మ్‌లో…  వెండితెరపై ఓ వెలుగు వెలిగిన కథానాయికలు తమన్నా, కాజల్‌కి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ పెద్దగా అచ్చొచ్చినట్టు లేదు. డిజిటిల్‌ ఎంట్రీ ఇస్తూ తమన్నా ‘లెవెన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మలి ప్రయత్నంలో కచ్చితంగా సక్సెస్‌ కొట్టేందుకు తమన్నా నటించిన ‘నవంబర్‌ స్టోరీస్‌’ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ కూడా ప్రేక్షకుల నిరాదరణ పొందింది. ఇక తమన్నా మాదిరిగానే కాజల్‌ పరిస్థితీ ఉంది. డిజిటల్‌ ఎంట్రీ ఇస్తూ కాజల్‌ ‘లైవ్‌ టెలికాస్ట్‌’ అనే హర్రర్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ దారుణంగా డిజాస్టర్‌ అయ్యింది. అయితే మలి ప్రయత్నంగా ‘పేపర్‌బాయ్’ ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వంలో ఓ వెబ్‌ ఫిల్మ్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతున్న ఈ వెబ్‌ ఫిల్మ్‌తో హిట్‌ కొట్టాలని కాజల్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట.

అజయ్‌ తో పదేళ్ల తర్వాత…  తెలుగు, తమిళ సినిమాల్లో రాణిస్తూనే అప్పుడప్పుడు బాలీవుడ్‌లోనూ నటిస్తూ సందడి చేస్తున్న కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌తో కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. హిందీ ‘సింగం’ చిత్రంలో అజయ్‌తో తొలిసారి నటించింది కాజల్‌. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్‌–కాజల్‌ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటిస్తున్నారు. కార్తీ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లోనే ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారు. అయితే తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌ పాత్రకు స్థానం లేదు. కానీ బాలీవుడ్‌కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు కూడా అవకాశం ఉందట. హీరో పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ను జోడించారట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనుందట.