ఆమెకు ఇప్పుడు ఒక్కటే కోరిక ఉంది !

కాజల్‌ జోరు ‘ఖైదీ నెంబర్‌ 150’ విజయంతో పెంచింది. ఆ సినిమా తర్వాత వరుసగా అటు తమిళం, ఇటు తెలుగు అవకాశాలు పుంజుకున్నాయి. తెలుగు, తమిళంలో రెండేసి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కాజల్‌ ప్రస్తుతం పెద్ద టార్గెటే పెట్టుకుందట. ఏకంగా రజనీకాంత్‌ సరసన నటించాలని భావిస్తుందట. ‘కాజల్‌కు ఈ ఏడాది చాలా స్పెషల్‌. ‘ఖైదీ నెంబర్‌ 150’తో ఈ ఏడాది ఫస్ట్‌ హిట్‌ను అందుకుంది. తమిళంలో అజిత్‌తో తొలిసారి కలిసి నటించింది. ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఆమె తొలిసారి నటించిన తేజ దర్శకత్వంలోనే తాజాగా తన 50వ సినిమా చేస్తుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర కథానాయకులు, స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. తమిళంలోనూ విజయ్, అజిత్‌, కార్తీ, ధనుష్‌ ఇలా అగ్ర కథానాయకులతో కలిసి నటించింది.

ఆమెకు ఇప్పుడు ఒక్కటే కోరిక ఉంది…. అది రజనీకాంత్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలన్నది. దాని కోసం ఎప్పట్నుంచో వెయిట్‌ చేస్తుందట. త్వరలోనే ఆ ఛాన్స్‌ వస్తుందని ఆశగా ఎదురు చూస్తుంది’ అని చిత్ర వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కాజల్‌.. రానా హీరోగా తేజ దర్శకత్వంలో నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ నెల 11న విడుదల కానుంది. దీంతోపాటు కళ్యాణ్‌రామ్‌తో ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటిస్తుంది. తమిళంలో విజయ్ సరసన ‘అదిరింది’, అజిత్‌ సరసన ‘వివేకం’ చిత్రాల్లో నటిస్తోంది.