ఇదంతా వారు నాపై పన్నుతున్న కుట్ర !

కాజల్ ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడితో తరచూ రహస్యంగా కలుసుకుంటున్నారని టాక్. అదే విధంగా ఇటీవల అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది.  ఇలాంటివి కాజల్ ను కలతకు గురిచేశాయట. దీంతో ఈ అమ్మడు కాస్త ఘాటుగానే స్పందించారు…. నా ఎదుగుదలను ఓర్వలేని వారే ఇలాంటి దుష్పచారాన్ని చేస్తున్నారు. నాపై కుట్రలు పన్నుతున్నారు. అయితే, అవినన్నేమీ చేయలేవు. మరి కొన్నేళ్ల వరకూ నేను  అగ్రహీరోలతోనే నటిస్తాననీ కాజల్ అన్నారు. తన స్థానాన్ని ఎవరూ కదిలించలేరు అనే ధీమాను వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్, అజిత్, వంటి ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తున్న ఏకైక హీరోయిన్ కాజల్ అగర్వాల్‌. అదే విధంగా తెలుగుతో పాటు హిందీలోనూ అవకాశాలను అందుకుంటున్న నటి కాజల్. తెలుగులో రానాతో రొమాన్స్ చేసిన “నేనే రాజు నేనే మంత్రి” చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. హిందీలో సన్నిడియోల్‌తో నటించే లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించిందనే ప్రచారం జరుగుతోంది.తాజాగా పీ.వాసు దర్శకత్వంలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం చేయనున్నట్లు టాక్ ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ ఆగర్వాల్ పై వదంతులు జోరుగానే సాగుతున్నాయన్నది గమనార్హం.ఆ మధ్య ఒక భేటీలో తాను ప్రేమ వివాహమే చేసుకుంటాననీ ఈ నటి చెప్పింది. అంతేకాక తనకు కాబోయే వరుడు సినిమా రంగానికి చెందిన వాడైనా లేదా మరే ఇతర రంగాలకు చెందిన వాడైనా పర్వాలేదనీ తెలిపింది. తను అందంగా లేకపోయినా పర్వాలేదు గానీ కచ్చితంగా ఆరడుగుల పొడవాటి వాడై ఉండాలని పేర్కొన్నారు. దీంతో కాజల్ ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరందుకుంది.