ఇకపై అన్ని విషయాలు నేనే చూసుకుంటా !

దక్షిణాదిలో గ్లామర్ నాయకిగా రాణిస్తున్న నటీమణుల్లో కాజల్‌అగర్వాల్‌ ఒకరు. “ఇకపై నాకు నేనే మేనేజర్‌” అని అంటోంది కాజల్‌ అగర్వాల్‌. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలిగిపోతున్న ఈమె తన కాల్‌షీట్స్, పారితోషికం వ్యవహారాలను సరిదిద్దడానికి ఒక మేనేజర్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే.రోని అతను కాజల్‌తో పాటు మరికొందరు హీరోయిన్లకు కాల్‌షీట్స్‌ వ్యవహారాలను చూసుకుంటున్నారు.

కాగా ఇటీవల టాలీవుడ్‌ను డ్రగ్స్‌ వ్యవహారం వణికిస్తున్న విషయం తెలిసిందే. సిట్‌ అధికారులు కొందరు ప్రముఖ, యువ నటీనటులను విచారించారు. అలాంటి వారిలో ..ఇంట్లో మాదక ద్రవ్యాలు సహా పోలీసులకు పట్టుబడి జైలు ఊసలు లెక్కిస్తున్నాడు కాజల్‌ అగర్వాల్‌ మేనేజర్‌.అయితే అతని విషయంలో స్పందించిన కాజల్‌ … అతను తనకు మేనేజర్‌ మాత్రమేనని, అతని వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని చెప్పింది. అలాంటి చట్ట విరోధక కార్యాలను తాను ఎప్పటికీ ప్రోత్సహించనని అంటున్న కాజల్‌ ఇకపై తానెవరినీ మేనేజర్‌గా నియమించుకోనని స్పష్టం చేశారు. ఇక సహాయకుడిని మాత్రం నియమించుకుని తనకు తానే మేనేజర్‌గా మారనున్నట్లు చెప్పారు. ఇకపై కథలు, పారితోషికం వంటి విషయాలను తానే చూసుకుంటానని కాజల్‌ ప్రకటించింది