తొలి సారి మహిళా ప్రధాన చిత్రంలో నాయికగా ….

నయనతార, అనుష్క, త్రిష వంటి కథానాయికల బాటలో పయనిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఓ మహిళా ప్రధాన చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ ఇటీవల ట్రెండ్‌ మార్చింది. ఇటీవల ‘శివలింగ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న మహిళా ప్రధాన  చిత్రంలో కాజల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్‌ ‘యామ్లా పాగ్లా దీవానా 3’ లో …. 

తెలుగు, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కాజల్‌ హిందీలోనూ నిరూపించుకునేందుకు తపిస్తుంది. గతంలో ఆమె ‘సింగం’, ‘స్పెషల్‌ 26’, ‘దో లఫ్జోన్‌ కి కహాని’ చిత్రాల్లో నటించింది. తాజాగా మరో బాలీవుడ్‌ ఆఫర్‌ను దక్కించుకుంది. బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ సీక్వెల్‌ ‘యామ్లా పాగ్లా దీవానా’ చిత్రం మూడవ సీక్వెల్‌లో సన్నీ డియోల్‌ సరసన నటిస్తుంది. 2011లో వచ్చిన ‘యామా పాగ్లా దీవానా’, 2013లో వచ్చిన ‘యామ్లా పాగ్లా దీవానా 2’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మూడో సీక్వెల్‌ రాబోతుంది. పంజాబీ ఫిల్మ్‌ మేకర్‌ నవనైత్‌ సింగ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌, ధర్మేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సన్నీ డియోల్‌కి ప్రియురాలిగా కాజల్‌గా కనిపించనున్నారు. మోడ్రన్‌ అమ్మాయిలా కనిపించే కాజల్‌ పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయట. ఈ చిత్రం వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. కాజల్‌ ప్రస్తుతం తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఎంఎల్‌ఎ’, తమిళంలో ‘వివేగం’, ‘మెర్సల్‌’ చిత్రాల్లో నటిస్తుంది.