ఇకపై ‘ఐటమ్ సాంగ్స్‌’కు ‘నో’ అంటూనే మరో సాంగ్ !

కాజల్ ఇకపై ‘ఐటమ్ సాంగ్స్‌’కు ‘నో’ అంటూనే మరో ఐటమ్ సాంగ్‌లో చిందేయనుందట… ‘జనతా గ్యారేజ్’ ఐటమ్ సాంగ్‌లో కాజల్ కనిపించిన తరువాతే కాజల్ కు క్రేజ్ పెరిగిందని చెప్పాలి.
 ఈ యేడాది కాజల్ నటించిన “ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి” చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి… తమిళనాట కూడా అమ్మడి హవా వీస్తోంది.అజిత్ తో ఆమె చేసిన ‘వివేకం’ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది . అంతకు ముందు ‘జనతా గ్యారేజ్’లో తొలిసారి కాజల్ ఐటమ్ సాంగ్‌లో కనువిందు చేసింది… అప్పట్లో కాజల్ కొన్ని పరాజయాలను చవిచూసింది… ఆ సమయంలోనే ‘జనతా గ్యారేజ్’లో కాజల్ చిందేయడంతో అమ్మడి పని అయిపోయిందనుకున్నారు… అయితే ఆ పాటను కేవలం హీరో యన్టీఆర్‌తో తనకున్న స్నేహబంధం కారణంగానే చేశానని, ఇకపై ‘ఐటమ్ సాంగ్స్‌’కు ‘నో’ అని అమ్మడు స్టేట్ మెంట్ ఇచ్చేసింది… ఇప్పుడు మరోమారు యన్టీఆర్ తోనే ఐటమ్ సాంగ్‌లో కాజల్ చిందేస్తోందనే వార్త చర్చనీయంశం  అయ్యింది …..
 నిజానికి ‘జనతా గ్యారేజ్’ ఐటమ్ సాంగ్‌లో కాజల్ కనిపించిన తరువాతే కాజల్ కు క్రేజ్ పెరిగిందని చెప్పాలి. ఆ సెంటిమెంట్ కారణంగానో, లేక యన్టీఆర్‌తో ఉన్న స్నేహబంధం కారణం వల్లో మరోమారు అతని సరసనే ఐటమ్ సాంగ్‌లో నర్తించనుందట… యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ‘జై లవకుశ’ చిత్రంలోనే ఓ ఐటమ్ సాంగ్‌లో కాజల్ కనువిందు చేయనుందట… పైగా ఈ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్, కాజల్ కు తెలుగునాట తొలి హీరో… అదీగాక ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో కాజల్ ‘ఎమ్.ఎల్.ఏ’ అనే చిత్రంలో నాయికగా నటిస్తోంది… ఈ కారణాలవల్లే కాబోలు ‘జై లవకుశ’లో కాజల్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందని వినికిడి… ఓ నాలుగైదు రోజుల పాటు ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ సాగనుంది… అందుకోసం కాజల్‌కు 40 లక్షల పారితోషికం కూడా ఇస్తున్నారట.