కాజల్ అగర్వాల్ నటిగా సత్తా చాటడమే కాదు బిజినెస్ రంగంలోను దూసుకుపోతుంది. ఇప్పటికే తన సోదరితో పలు బిజినెస్‌లు చేస్తున్నకాజల్ వివాహం తర్వాత కూడా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. తాజాగా కాజల్ భర్తతో కలిసి ఓ కొత్త బిజినెస్‌ను ప్రారంభించింది. గౌతమ్‌తో కలిసి కాజల్ ఇంటీరియర్ బిజినెస్‌ను ప్రారంభించింది. దీనికి `కిచ్డ్` అనే పేరు కూడా పెట్టింది. గృహాలంకరణకు సంబంధించిన అన్నింటినీ వీరి బ్రాండ్ అందిస్తుంది. ఇది భర్తతో కలిసి తను ప్రారంభించిన మొదటి వెంచర్ అని కాజల్ వెల్లడించింది. నిజానికి కాజల్ సినిమా నిర్మాణం చేపట్టాలని అనుకుంది. అయితే వివాహం తర్వాత ఆమె ఆలోచనలన్నీ మారిపోయాయి. భర్తకు అనుభవం ఉన్న వ్యాపార రంగంపైనే దృష్టి సారించాలని ఫిక్స్ అయింది.
ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. “గౌతమ్ నేను కలిసి మీ కోసం కిచ్డ్ అనే హోమ్ డెకార్ లేబుల్‌ని తీసుకొస్తున్నాము. మా ఇద్దరి ప్రేమ నుండి ఇది పుట్టింది. ప్రస్తుతం ఫెస్టివ్ థీమ్‌తో చేతితో తయారుచేయబడిన కుషన్స్‌ని తెస్తున్నాము. అందరికి నచ్చేలా. ఇంటి అందాన్ని పెంచేలా ఈ ప్రొడక్ట్స్‌ని తీసుకురావడమే మా బ్రాండ్ ప్రధాన ఉద్ధేశం. మీ సపోర్ట్ మాకు తప్పక ఉంటుందని ఆశిస్తున్నాను. లిమిటెడ్ కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా షాపింగ్ చేయండి. మా బ్రాండ్ నుండి వస్తున్న తొలి ప్రొడక్ట్స్‌ని ఎంజాయ్ చేయండి” అని కాజల్ పేర్కొంది.
‘గోస్టీ’లో ప్రభుదేవాకు జోడీగా.. పెళ్లికి ముందులానే పెళ్లయ్యాక కూడా బిజీగా ఉంటోంది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత డీకే దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ హారర్ చిత్రం అంగీకరించింది కాజల్. ఇది తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌కు జోడీగా ప్రభుదేవా నటించబోతున్నారు. ఈ చిత్రంలో నటించే మరో ఇద్దరు హీరోయిన్లను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. తాజాగా తమిళంలో రెండో సినిమా అంగీకరించింది. ‘గోస్టీ’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం కూడా హారర్ జానరే. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గోస్టీ’లో హారర్ ఎంత ఉంటుందో వినోదం కూడా అంతే ఉంటుందని తెలిసింది. ఎందుకంటే.. ఈ సినిమాలో సుమారు 25మంది కమెడియన్లు నటించనున్నారు. అలాగే ఓ ప్రముఖ హీరో కూడా అతిథి పాత్రలో కనిపిస్తారట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం కాజల్ చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’, దుల్కర్ సల్మాన్ ‘సినామిక’ లో చేస్తోంది .