మంచి స్నేహితులు నిర్మాతలవుతున్నారు !

కాజల్.. తమన్నా… కూడా నిర్మాతలుగా మారుతున్నారు.  స్టార్ హీరోలు చిత్ర నిర్మాణం పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఇక కొత్తగా వచ్చిన హీరోలు కాస్త కుదురుకోగానే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి వరకూ హీరోయిన్స్ వేరే వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్లు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాజల్ చేరనున్నట్టు తెలుస్తోంది. కేఏ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమాను నిర్మించడానికి కాజల్ రెడీ అవుతోందట. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా తమన్నా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. కాజల్ .. తమన్నా ఇద్దరూ కూడా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కాజల్ నిర్మించే ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఆల్రెడీ ఆయన కథ చెప్పడం .. కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. కాజల్ నిర్మాతగా కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది ఈ సినిమా ఫలితంపై ఆధారపడి వుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

క్వాలిటీ ఆఫ్‌ పెర్ఫార్మెన్స్‌
ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో తన పేరు తప్పిపోకుండా కష్టపడుతూనే ఉన్నారు కాజల్‌ అగర్వాల్‌. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో స్పీడ్‌ పెంచారీ బ్యూటీ. మీ సక్సెస్‌ మంత్ర ఏంటి? అని కాజల్‌ని అడిగితే…‘‘నాకు సూట్‌ అయ్యే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. సినిమా సినిమాకి నా పాత్రల మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతా. నా పాత్రకు ఆడియన్స్‌ ఎంత కనెక్ట్‌ అవుతారనే విషయం కూడా మైండ్‌లో ఉంచుకుంటా. క్వాలిటీ ఆఫ్‌ పెర్ఫార్మెన్స్‌ ముఖ్యం.రోల్‌ మోడల్‌ అంటూ నాకు ప్రత్యేకంగా ఎవరూ లేరు. ప్రముఖ నటీనటుల నుంచి ఒక్కో డిఫరెంట్‌ క్వాలిటీని తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీత’ అనే సినిమాలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు కాజల్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరో. ఈ సినిమాలో కాజల్‌ క్యారెక్టర్‌లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయట. కమల్‌హాసన్‌–శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఇండియన్‌ 2’ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటిస్తారు. తమిళంలో ఆమె నటించిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.