ఈ చిత్రం విషయంలో కళ్యాణ్ రామ్ ఎక్కడా తగ్గలేదు !

హీరోల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబ సభ్యులే సినిమాలను నిర్మించడం చూస్తూనే ఉన్నాం.  నిర్మాత, హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం తన ఎన్టీఆర్ ఆర్ట్స్  బ్యానర్ పై సోదరుడైన ఎన్టీఆర్‌తో ‘జై లవ కుశ’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు తారక్ తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే,  రవితేజ-సురేందర్ రెడ్డి తో తీసిన  ‘కిక్-2’ సినిమాతో భారీగా నష్టపోయిన కళ్యాణ్‌రామ్ కోలుకోవడానికి ఎన్టీఆర్ మార్కెట్‌ను ఉపయోగించుకుంటున్నాడనే వార్తలు హల్‌చల్ చేసాయి.

కానీ అసలు విషయంలోకి వెళ్తే కళ్యాణ్‌రామ్ తన సోదరుడు ఎన్టీఆర్‌కు రెమ్యునరేషన్ విషయంలో ఏమీ తక్కువ చేయలేదట. ఎన్టీఆర్ స్టార్ రేంజ్ ప్రకారం అతనికి 14 కోట్ల పారితోషికాన్ని అందజేశాడని తెలిసింది. సాధారణంగా హీరోలు వారి దగ్గరి వారితో సినిమా చేసినప్పుడు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ కళ్యాణ్‌రామ్ మాత్రం ఎన్టీఆర్‌కు ఎంత పారితోషికం ఇవ్వాలో అంత ఇచ్చేశాడట. అయినా, ఎన్టీఆర్ మూడు పాత్రలు చెయ్యడం తో  వచ్చిన క్రేజ్ వల్ల… ఈచిత్రానికి భారీ బిజినెస్ జరగడం తో కళ్యాణ్ రామ్  చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ‘జై లవ కుశ’ ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశిఖన్నా, నివేదిత థామస్ హీరోయిన్లు గా  నటిస్తున్న ఈ చిత్రం లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ కి  నర్తిస్తోంది . కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సినిమా రూపుదిద్దుకుంటోంది.