ఈ మూడు చిత్రాల తర్వాతనే పూర్తి స్థాయి రాజకీయాలు !

‘విశ్వరూపం-2’, ‘శభాష్ నాయుడు’.. శంకర్ ‘ఇండియన్-2’.. ఈ మూడు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన తర్వాతనే… పూర్తిగా రాజకీయాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడట ‘యూనివర్శల్ స్టార్’ కమల్ హాసన్.  ప్రత్యక్ష రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం పెంచుకోవడానికి సిద్ధమవుతోన్న కమల్ హాసన్.. పెండింగ్ ప్రాజెక్ట్స్‌ను పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ‘విశ్వరూపం-2’ని విడుదలకు ముస్తాబు చేసిన కమల్. తాజాగా ‘శభాష్ నాయుడు’ను కూడా పట్టాలెక్కించబోతున్నాడట.
 ఇక రాజకీయాలతో బిజీకాబోతున్న విశ్వనటుడు కమల్ హాసన్.. చేతిలో ఉన్న సినిమాలను విడుదలకు ముస్తాబుచేస్తున్నాడు. ఇప్పటికే ‘విశ్వరూపం-2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోన్న కమల్.. తాజాగా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘శభాష్ నాయుడు’ను కూడా పట్టాలెక్కించబోతున్నాడట. రెండేళ్ల క్రితమే త్రిభాషా చిత్రంగా మొదలైన ‘శభాష్ నాయుడు’ చిత్రానికి నిర్మాత, దర్శకుడు కూడా కమల్ హాసనే. ఫుల్‌లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్‌గా అలరించే ఈ సినిమా మేజర్ షెడ్యూల్‌ను అమెరికాలో జరిపాడు. లేటెస్ట్‌గా ఆగస్ట్ నుంచి ‘శభాష్ నాయుడు’ కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నాడట.
‘శభాష్ నాయుడు’లో కమల్‌తో పాటు.. అతని కుమార్తె శ్రుతి హాసన్ కూడా నటిస్తోంది. బ్రిటన్ నటుడు మైఖేల్‌తో పీకల్లోతు ప్రేమలో పడ్డ శ్రుతి.. ఆ మధ్య సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. మళ్లీ ఇటీవలే ఈ స్టార్ డాటర్ బాలీవుడ్‌లో ఓ కొత్త సినిమాలో నటిస్తోంది. తెలుగులోనూ రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఓ వైపు తండ్రికి.. మరోవైపు కుమార్తె శ్రుతి హాసన్‌కి ‘శభాష్ నాయుడు’ ఎంతో స్పెషల్ కాబోతుంది. ‘శభాష్ నాయుడు’లో బ్రహ్మానందం, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రధారులు. ‘విశ్వరూపం-2’, ‘శభాష్ నాయుడు’.. శంకర్ ‘ఇండియన్-2’.. ఈ మూడు చిత్రాలను ప్రేక్షకులకు అందించి.. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడట యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్.