`భార‌తీయుడు` సీక్వెల్‌గా రాబోతున్న `ఇండియ‌న్ 2`

`దిల్` నుండి ఇటీవ‌ల విడుద‌లైన `ఫిదా` వ‌ర‌కు ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఓ సెన్సేష‌న‌ల్ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఆ చిత్రమే `ఇండియ‌న్ 2 `.  21 ఏళ్ల క్రితం విడుద‌లై తెలుగు, త‌మిళనాట బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టిన చిత్రం `భారతీయుడు` అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. స‌మాజంలో లంచానికి వ్య‌తిరేకంగా పోరాడే ఓ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడి క‌థ‌తో రూపొందిన `భారతీయుడు` చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ అద్భుతంగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.  ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడుగా సినీ ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో మెప్పించారు. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్‌ల హిట్  కాంబినేష‌న్‌లో  భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా `ఇండియ‌న్ 2` భారీ బ‌డ్జెట్ సినిమాను దిల్‌రాజు త‌న నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై నిర్మించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా…హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బేన‌ర్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన సంగ‌తి తెలిసిందే. మా ప్ర‌య‌త్నాన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు వారు మా బేన‌ర్‌పై ఉంచిన న‌మ్మ‌కంతో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `ఇండియ‌న్ 2` సినిమాను నిర్మించ‌బోతున్నాం. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో కాంటెంప‌ర‌రీ పాయింట్‌తో ఈ సీక్వెల్ రూపొంద‌నుంది. మా నిర్మాణ సంస్థ‌లో అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారు సినిమాను డైరెక్ట్ చేస్తారు. శంక‌ర్‌గారు ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ `2.0`తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తైన వెంట‌నే, మా `ఇండియ‌న్ 2` మొద‌లవుతుంది. మొద‌టి భాగంగా వ‌చ్చిన `భార‌తీయుడు` సినిమా ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాను మించేలా `ఇండియ‌న్ 2`ను తెలుగు, త‌మిళ భాషల తో పాటు ఇతర భాషల్లో  నిర్మించ‌బోతున్నాం. సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు.

The sequel of Kamal Haasan’s iconic film ‘Indian/Bharateeyudu’ 
Nearly 21 years after the release of the sensational Bharateeyudu (Indian in Tamil and Hindustani in Hindi) which was a blockbuster upon release, the duo S. Shankar and actor Kamal Haasan are all set to come together again, and this time it is for the sequel of the same film which will be titled Indian 2. And what’s interesting is the Tamil-Telugu bilingual film which will also release in several other Indian languages is set to be produced by Telugu ace producer Dil Raju under his Sri Venkateshwara Creations banner.
After bankrolling several mega ventures from Dil to Fidaa, the producer has taken up this very interesting project.Bharateeyudu was notable for its striking story of a freedom fighter who rises up to fight against corruption in the post-independent India. And now, this sequel is going to be produced on a vast scale.
Speaking about the development, Dil Raju shares, “We have always strived to bring meaningful cinema to the Telugu audiences and it is in the same endeavour that we have collaborated with this prestigious and ambitious project. With high technical values and a story to suit the present day scenarios, we have decided to go all out to bring this film to the silver screen.”
Meanwhile, he also informed that director Shankar is busy with Rajinikanth’s 2.0 and that this film’s pre-production will begin soon after that.
He added, “The film will be a Telugu-Tamil bilingual which will eventually have a wide release in several languages. We will soon announce other details regarding the cast and crew of the film.”