పాటల చిత్రీకరణలో కంచర్ల ఉపేంద్ర ‘కంచర్ల’

‘కంచర్ల’ టాకి పార్ట్ పూర్తి చేసుకోని పాటల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని నిర్మాత DR. కంచర్ల అచ్యుతరావు తెలియజేసారు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం ద్వారా సుపరిచితం అయిన హీరో కంచర్ల ఉపేంద్ర 2 వ చిత్రం గా *కంచర్ల* ను మార్చ్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియా మిత్రులతో ప్రొడ్యూసర్ DR. కంచర్ల అచ్యుతరావు గారు మాట్లాడుతూ….      పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పూర్తి స్థాయి కుటుంబ కధ – యాక్షన్ తో ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అల్లరిస్తుందని, ప్రముఖ ఫైట్ మాస్టర్ ‘పుష్ప’ ఫేమ్ డ్రాగన్ ప్రకాష్ గారితో  ఫైట్స్ ను నిర్మించాము. మార్చ్ లో విడుదల కి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
హీరో ఉపేంద్ర బాబు మాట్లాడుతూ… ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని తప్పక అల్లరిస్తుందని,చక్కని కధ ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని అన్నారు.
చిత్ర యూనిట్ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
ఈ సినిమా కి దర్శకత్వం : యాద్ కుమార్,  DOP:  గుణశేఖర్