ఏదేమైనా విజయవంతంగా డైరెక్టరై పోయింది !

మెగాఫోన్‌ పట్టుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కంగనా రనౌత్‌కు ‘మణికర్ణిక’ చిత్రంతో ఆ కోరిక నెరవేరిందని బాలీవుడ్‌ సినీ వర్గాలంటున్నాయి. ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంలో కంగనా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఈ చిత్ర అసలు దర్శకుడు క్రిష్‌ తెలుగులో ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌తో బిజీ అవడంతో దాదాపు నలభై శాతం కంగనానే డైరెక్ట్‌ చేశారు. మరోవైపు భోపాల్‌లో జరుగుతున్న ‘పంగా’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూనే, మరో పక్క ముంబయిలో ‘మణికర్ణిక’ చిత్ర పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్‌ని కూడా కంగనానే చూసుకుంటున్నారట. దీని కోసం ప్రతి రోజూ భోపాల్‌ నుంచి ముంబాయికి ఆమె చక్కర్లు కూడా కొడుతున్నారట.ఈ చిత్రం ‘వీర నారి ఝాన్సీ లక్ష్మీ భాయి’ కధతో చేసారు. ఈ చిత్ర విజయం పట్ల అంతా పూర్తి భరోసాతో ఉన్నారు . 
‘మణికర్ణిక’ చిత్రానికి సంబంధించి పూర్తి బాధ్యతలను కంగనానే నిర్వర్తిస్తున్న కారణంగా దర్శకురాలిగా ఆమె పేరునే ఖరారు చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుందని సమాచారం. టైటిల్‌ కార్డ్స్‌తోపాటు పబ్లిసిటీ పోస్టర్స్‌లోనూ దర్శకుడు క్రిష్‌ పేరుని తొలగించి కంగనా పేరునే ఉంచాలని యోచిస్తున్నారట. ఏదిఏమైనా ఇకపై కంగనాని అందరూ ‘మణికర్ణిక’ దర్శకురాలు అని పిలవడం ఖాయమనిపిస్తోంది.  

కబడ్డీ మొదలైంది !

కబడ్డీ కోర్టులో ప్రత్యర్థులను చెడుగుడు ఆడేందుకు సిద్ధమయ్యారు కథానాయిక కంగనా రనౌత్‌. ‘బరేలీ కీ బర్ఫీ’ ఫేమ్‌ అశ్వినీ అయ్యర్‌ తివారి దర్శకత్వంలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘పంగా’ చిత్రం ఆదివారం మొదలైంది. ఇందులో కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తారు కంగనా. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ భోపాల్‌లో స్టార్ట్‌ అయింది. ఈ షెడ్యూల్‌ 20 రోజులు సాగనుందని బాలీవుడ్‌ టాక్‌.