రెమ్యూనరేషన్‌లో మొదటి స్థానంలో కంగనా

హీరోలకు దీటుగా హీరోయిన్లు రెమ్యూనరేషన్‌ తీసుకోవడం ఈ ఏడాది విశేషం. ఈసారి కూడా కథానాయికలకు ప్రాధాన్యత కలిగిన పాత్రలే దక్కాయి. మహిళలకు పెద్దపీట వేసే చిత్రాలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. 24కోట్లు రెమ్యూనరేషన్‌తో కంగనా రనౌత్‌ మొదటి స్థానంలో ఉన్నారు.21 కోట్లతో దీపికా రెండో స్థానంలో ఉన్నారు .18కోట్లతో ప్రియాంక మూడో స్థానంలో.. 17కోట్లతో కరీనా కపూర్‌ నాలుగో స్థానంలో.. 15కోట్లతో శ్రద్ధా కపూర్‌ ఐదో స్థానంలో..14కోట్లతో అలియా భట్‌ ఆరో స్థానంలో.. 12 కోట్లతో కత్రినాకైఫ్‌ ఏడో స్థానంలో.. 10.5 కోట్లతో సోనమ్‌ కపూర్‌ ఎనిమిదో స్థానంలో.. 10కోట్లతో విద్యాబాలన్‌ తొమ్మిదో స్థానంలో.. 9 కోట్లతో అనుష్క శర్మ పదో స్థానంలో నిలిచారు.
తాజాగా ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యధికంగా సంపాదిస్తున్న ప్రముఖుల జాబితాలో 293.25 ఆదాయంతో అక్షయ్ కుమార్‌, 229.25కోట్లతో సల్మాన్‌, 239.25కోట్లతో అమితాబ్‌ బచ్చన్‌, 124.38కోట్లతో షారూఖ్‌ ఖాన్‌, 118.2కోట్లతో రణ్‌వీర్‌ సింగ్‌, 59.21కోట్లతో అలియాభట్‌, 48కోట్లతో దీపికా పదుకొనె టాప్‌ టెన్‌ స్థానాలు దక్కించుకున్నారు.