కంగనా కబడ్డీ కమిట్‌మెంట్‌

‘మణికర్ణిక’: ‘ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’లో ఝాన్సీ రాణిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నకంగనా రనౌత్‌ విలక్షణ పాత్రలకు, వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌. అలాగే ‘మెంటల్‌ హై క్యా’ చిత్రంలో విలక్షణంగా కనిపిస్తూనే అందరినీ భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అశ్విని ఐయ్యర్‌ తివారీ దర్శకత్వంలో రూపొందే నూతన చిత్రంలో ‘కబడ్డీ ప్లేయర్‌’గా బరిలోకి దిగబోతున్నారు. జాతీయ స్థాయి కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ ఆధారంగా తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం కంగనా విస్తృతంగా కసరత్తులు చేస్తున్నారట. కబడ్డీ ఆటను లైవ్‌గా చూస్తూ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వర్క్‌ షాప్స్‌లో పాల్గొంటున్నారు. ప్రో కబడ్డీ లీగ్‌కు వెళ్ళి ప్రత్యక్షంగా కబడ్డీ ఆటను వీక్షిస్తున్నారు. అంతటితో ఆగకుండా తన ప్రాక్టీస్‌ సెషన్‌ను అక్కడే నిర్వహిస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆయా కబడ్డీ టీమ్‌లతో కలిసి ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నారట. ఇది చూసి కంగనా వర్క్‌ కమిట్‌మెంట్‌పై అంతర్జాతీయ కబడ్డీ ఆటగాళ్ళు సైతం నివ్వెరపోతున్నారట. కంగనా ప్రస్తుతం ‘ఇమ్లీ’ చిత్రంలోనూ నటిస్తున్నారు.
ఇవ్వ‌కుండా దేవుడు మేలు చేశాడు
`క్వీన్‌` కంగనా ర‌నౌత్ తెర‌వెనుక కూడా చాలా బోల్డ్‌గా ఉంటుంది. మ‌నసులో ఉన్న‌ది ధైర్యంగా మాట్లాడుతుంది, న‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంది.  హృతిక్ రోష‌న్‌తో ఆమె కొద్ది రోజులు ప్రేమాయ‌ణం సాగించిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ విడిపోయారు. దీంతో క‌ల‌త చెందిన కంగ‌న‌.. ప‌లుసార్లు హృతిక్‌పై బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పించింది. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ… హృతిక్‌తో త‌న ప్రేమ గురించి ప‌రోక్షంగా కామెంట్ చేసింది
 
`నేను ఏది కోరుకుంటే అది ఇవ్వ‌కుండా దేవుడు నాకు చాలా మేలు చేశాడు. నేను కోరుకున్న‌వ‌న్నీ నాకు చెడు చేసేవే. పెళ్లి చేసుకోవాల‌ని చాలాసార్లు అనుకున్నా. కానీ, ఒక్క‌సారి కూడా అది జ‌ర‌గ‌క‌పోవ‌డం చాలా సంతోషంగా ఉంది. కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగిపోయాక‌.. `ధ‌న్య‌వాదాలు దేవుడా.. న‌న్ను ర‌క్షించావు` అని అనుకుంటా. నా జీవితంలో ఏమి జ‌రిగిందో (హృతిక్‌తో ప్రేమ విఫ‌ల‌మ‌వ‌డం) మీకు తెలుసు కదా. నా జీవితంలో నాకు ల‌భించిన వాటితో చాలా సంతోషంగా ఉన్నాన‌`ని కంగ‌న చెప్పింది.