ఆ తత్వమే జీవితంలో నాకు విజయాల్ని తెచ్చింది!

“ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలంటే.. అందరికి నచ్చేలా ఉండాలనే నియమమేదీ లేదు. ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారనేది పట్టించుకోను. నా మనసుకు నచ్చినట్లుగా నేనుంటా…..అని అంటోంది ‘మణికర్ణిక’ కంగనా రనౌత్‌. సినిమారంగం లో పేరుప్రఖ్యాతులు సంపాయించే కొద్దీ… మనల్ని అభిమానించేవారితో పాటు శత్రువులూ పెరుగుతారు. అవకాశం దొరికితే తొక్కి పడేయాలని చూస్తుంటారు. వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా- నమ్మిన విలువలకు కట్టుబడి, పోరాటం చేసినప్పుడే వారిని ఎదుర్కోగలం” అని అంటోంది కంగనా .
 
కంగనా రనౌత్‌ మాట్లాడుతూ..”చిత్రసీమలో నేను నిలదొక్కుకుంటానని ఎవరూ అనుకోలేదు. కొన్ని సినిమాకే నా ప్రయాణం ఆగిపోతుందని భావించారు. నా ఎదుగుదలను చూసి చాలా మంది అసూయ చెందారు.అయితే నేను .. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి..ఎలా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టంగా ఆలోచిస్తాను. ఎవరికీ భయపడకుండా ధైర్యంగా సవాళ్లను స్వీకరిస్తాను. ఆ తత్వమే జీవితంలో నాకు విజయాల్ని తెచ్చిపెట్టింది. విజయ శిఖరాల్ని అధిరోహించాలంటే… అందరికి నచ్చేలా ఉండాలనే నియమమేదీ లేదు. ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారనేది పట్టించుకోను .నా మనసుకు నచ్చినట్లుగా నేనుంటా” అని కంగనా చెప్పింది 
 
థాయిలాండ్‌లో యాక్షన్‌ శిక్షణ
మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ హీరోలకు దీటుగా రాణిస్తున్నారు కంగనా రనౌత్‌ .ఆమె సినిమాలు స్టార్‌ హీరోల సినిమాల తరహాలో కలెక్షన్లు రాబడతాయి .’క్వీన్‌’, ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’, ‘మణికర్ణిక’ చిత్రాలు అందుకు ఉదాహరణగా నిలిచాయి .కంగనా ప్రస్తుతం ఇంకో మహిళా ప్రధాన చిత్రం ‘ధాకడ్‌’లో నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నఈ చిత్రానికి రజనీష్‌ ఘారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కంగనా పాత్ర విశేషాల గురించి రజనీష్‌ ఘారు చెబుతూ…”ధాకడ్‌’ డిఫరెంట్‌ స్టయిలిష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.ఇందులో కంగనా తుపాకీ వాడటం..స్టంట్స్‌ చేస్తుంది. అందుకోసం ఆరు వారాలపాటు ..థాయిలాండ్‌లో స్టంట్‌ డైరెక్టర్స్‌ సారథ్యంలో శిక్షణ తీసుకుని, యాక్షన్‌కి అన్నింటిలోనూ మంచి పట్టు సాధించింది” అని తెలిపారు.
 
“ధాకడ్‌’ హాలీవుడ్‌ చిత్రం ‘రెసిడెంట్‌ ఈవిల్‌’ని పోలి ఉంటుంది. ఇందులో పలు ఛేజింగ్‌ లు, కత్తి ఫైటింగ్‌లు, గన్‌ ఫైటింగ్‌లుంటాయి” అని కంగనా చెప్పింది. దీంతో పాటు కబాడీ కధతో ‘పంగా’ చిత్రంలోనూ కంగనా నటిస్తోంది. అలాగే తమిళనాడు మాజీ సీఎం, మేటినటి జయలలిత పై ‘తలైవి’ పేరుతో ఏ.ఎల్‌.విజయ్ రూపొందుతున్న బయోపిక్‌లో జయలలితగా నటిస్తోంది . ఈ సినిమా గురించి కంగనా చెబుతూ..”జయలలిత నటించిన సినిమాలన్నింటినీ చూస్తున్నా. అలాగే రాజకీయ వేదికలపై ఆమె ప్రసంగాలు.. హావభావాలను గమనిస్తున్నా. ఇందులో అసలైన జయలలితని చూస్తారు’ అని తెలిపింది. ఈ చిత్రానికి కంగనా ఏకంగా రూ.20కోట్లు పారితోషికంగా తీసుకుంటోందని సంచలన వార్త వినిపిస్తోంది