ఆధిపత్యధోరణి పై పోరాటం..కెరీర్‌పై అమితశ్రద్ధ !

కంగ‌నా యుద్ధవిమానాలు నడపటంలో నేర్పు, పైలెట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెళకువలను నేర్చుకుంటోంది. కంగనా రనౌత్ బంధుప్రీతి, బాలీవుడ్‌లోని ఆధిపత్యధోరణి పై పోరాడుతూనే మరోవైపు కెరీర్‌పై శ్రద్ధ చూపిస్తోంది. ‌తాను చేస్తున్న కొత్త చిత్రాల కోసం కసరత్తులు చేస్తోంది. అందుకే జాతీయ స్థాయిలో పలుమార్లు అవార్డులు అందుకుంది. ‘తేజస్‌’ సినిమాలో ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ పాత్రలో కంగనా రనౌత్‌ కనిపించనుంది. యుద్ధవిమానాలు నడపటానికి మహిళా పైలెట్లకు 2016లో మన ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ చారిత్రక ఘటన ఆధారంగా ‘తేజస్‌’ తెరకెక్కుతోంది. సర్వేష్‌ మేవారా దర్వకత్వం వహిస్తున్న ‘తేజస్‌’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలకానుంది. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా కోసం కంగనా రనౌత్‌ వర్క్‌షాప్‌లకు హాజరవుతోంది. వింగ్‌ కమాండర్‌ అభిజీత్‌ గోఖలే ఆమెకు శిక్షణ నిస్తున్నారు.

ప్రస్తుతం మ‌నాలీలో ఉన్న కంగ‌నా డైరెక్ట‌ర్ స‌ర్వేశ్ మీవారా, సోద‌రి రంగోలి చందేల్‌, కోచ్ వింగ్ క‌మాండ‌ర్ అభిజిత్ గోఖ‌లేతో క‌లిసి సినిమా వ‌ర్క్ షాప్ లో పాల్గొంది. టాలెంటెడ్ డైరెక్టర్ స‌ర్వేశ్ మెవారా, కోచ్ వింగ్ క‌మాండ‌ర్ అభిజిత్ తో క‌లిసి ప‌ని మొద‌లు పెట్ట‌డం చాలా సంతోషంగా ఉందని చెప్పింది కంగ‌నా. యుద్ధవిమానాలు నడపటంలో నేర్పు, పైలెట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెళకువలను నేర్చుకుంటోంది. ఈ వర్క్‌షాప్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌చేసింది కంగనా రనౌత్‌. వృత్తిపట్ల ఆమె అంకితభావానికి నిదర్శనమిదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌లే త‌న సోద‌రుడి వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ తో బిజీగా గ‌డిపిన విష‌యం తెలిసిందే. తేజాస్ ఫ‌స్ట్ లుక్ లో యుద్ధ విమానం ప‌క్క‌న నిలుచొని కంగ‌నా ధైర్యంగా చూస్తున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. రోనీ స్క్రూవాలా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కంగనా జయలలిత గా అసెంబ్లీలో…  జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత ఆరునెలల నుంచి షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌  లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ‘తలైవి’ చిత్రం  తిరిగి షూటింగ్‌ను ప్రారంభించినట్లు  కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది.

కంగనా మాట్లాడుతూ.. ‘జయ మా ఆశీస్సులతో ‘తలైవి’ మరో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ యాక్షన్‌, కట్‌ చెప్పే విధానం ఏ మాత్రం మారలేదు’ అంటూ పేర్కొంది. తలైవి షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఫొటోలు వైరల్‌ అవుతూ వచ్చాయి. అయితే తాజాగా.. కంగనా జయలలిత పాత్రలో అసెంబ్లీకి వస్తున్న ఫొటోలు, అసెంబ్లీలో కూర్చున్న ఫొటోలను షేర్‌ చేసింది. ఇందులో కంగనా జయలలిత పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది.అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తలైవి విడుదల తేదీని మూవీ యాజమాన్యం త్వరలో ప్రకటించనుంది.