బయోపిక్ ‘ఐరన్‌ లేడీ’.. ‘టాంబ్ రైడ‌ర్’ యాక్ష‌న్ క్వీన్

కంగనా రానౌత్‌తో ఒక నిర్మాత రూ.100 కోట్ల బడ్జెట్‌లో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ చిత్రం పేరే ‘తలైవి’. ఈ టైటిల్‌తో ఆ చిత్ర పూర్వాపరాలు అందరికీ అర్థం అయిపోయి ఉంటాయి. నాటి ప్రఖ్యాత నటీమణి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇతివృత్తంతో తెరకెక్కనున్న చిత్రమే ‘తలైవి’. నిజానికి జయలలిత జీవిత చరిత్రతో ప్రస్తుతం రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి.
 
అందులో ఒక చిత్రం పేరు ‘ది ఐరన్‌ లేడీ’. ఇందులో నటి నిత్యామీనన్‌ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. మరో చిత్రం ‘తలైవి’. దీనికి విజయ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రానౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించనున్నారు. ఇందుకోసం స్లిమ్‌గా ఉండే కంగన చాలా కసరత్తులు చేసి జయలలితగా జీవించడానికి కాస్త బరువు కూడా పెరిగిందట. కాగా వచ్చే నెల ద్వితీయార్థంలో సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్న ఈ  చిత్రాన్ని ఇంతకు ముందు తెలుగులో ‘ఎన్‌టీఆర్’, ‘మహానాయకుడు’ చిత్రాలను నిర్మించిన విబ్రి సంస్థ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనుందని తెలిసింది. ఈ సంచలన చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడతాయి. కాగా అప్పుడెప్పుడో ‘దామ్‌ధూమ్‌’ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన నటి కంగనా రానౌత్‌ మళ్లీ తలైవి చిత్రం ద్వారా మరోసారి తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
మార‌ణాయుధాల‌తో షాకింగ్ లుక్‌లో
కంగ‌నా ర‌నౌత్ ఇటీవల తెలుగు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన “జడ్జిమెంటల్ హై క్యా” చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఇక అశ్విన్ అయ్యర్ తివారి దర్శకత్వంలో “పంగా” అనే క్రీడా ప్రధాన చిత్రంలో నటించనుంది . వీటితో పాటు కంగ‌నా .. ర‌జ‌నీష్ రాజి ఘాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ధాక‌డ్’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది. ఇటీవ‌ల‌ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కంగ‌నా.. మంట‌ల మ‌ధ్య నిలుచొని రెండు గ‌న్స్ ప‌ట్టుకొని ఉంది. మార‌ణాయుధాల‌తో షాకింగ్ లుక్‌లో క‌నిపిస్తుంది.
“టీజర్‌లో ఉపయోగించిన టీజర్ నిజమైంది. గన్స్ఉపయోగించాలంటే శక్తినంతా కూడ దీసుకునేదాన్ని. నేను పడే కష్టాన్ని చూసి డైరెక్టర్ నవ్వుకునేవారు. షూటింగ్‌లోనైనా డమ్మీ తుపాకీ ఉపయోగిస్తే బావుంటుందని ఆశిస్తున్నాను“ అని కంగ‌నా ర‌నౌత్అన్నారు.చూస్తుంటే 2001లో ఏంజెలినా జోలి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన‌ ‘టాంబ్ రైడ‌ర్’ గుర్తుకొస్తుందని నెటిజ‌న్స్ పేర్కొన్నారు.లేడీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తొలి యాక్ష‌న్ ఫిలిం ఇదే కాగా, ఈ సినిమా త‌న కెరీర్‌లో బెంచ్ మార్క్‌గా నిలుస్తుంద‌ని కంగ‌నా భావిస్తుంది . వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.