‘మణి కర్ణిక’ షూటింగ్‌లో కంగనకు గాయాలు

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ‘మణి కర్ణిక – ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు.  ఈ చిత్రానికి మన తెలుగు దర్శకుడు క్రిష్  దర్శకత్వం వహిస్తున్నారు . యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ సందర్భం గా  కంగనకు తలపై కత్తి గాట్లు తగిలాయి. దీంతో సినిమా యూనిట్ ఆమెను ఆనుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లో షూటింగ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయాలపాలైన వెంటనే ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను ఐసియులో ఉంచారు. చికిత్సలో భాగంగా వైద్యులు ఆమె తలకు 15 కుట్లు వేశారు. కంగన కోలుకునేందుకు కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండవలసి వస్తుందని వైద్యుల సూచిస్తున్నారు. షూటింగ్‌లో భాగంగా కంగన.. కో స్టార్ నిహార్ పాండ్యల మధ్య ఒక సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కత్తులతో పోరాడాల్సి ఉంది. అయితే  కత్తి అనుకోకుండా ఆమె తలకు తగలడంతో గాయమైంది. వీరనారి లక్ష్మీభాయి జీవిత గాధ ఆధారంగా ఈ బాలీవుడ్ సినిమా నిర్మిస్తున్నారు.