మమ్మల్ని చులకనగా మాట్లాడటం సరైంది కాదు !

‘ఒకప్పుడు ప్రేక్షకులు నటీనటులను బాగా గౌరవించే వారు. కానీ ఇప్పుడు వారిలో ఆర్టిస్టులపై చులకన భావం పెరిగిపోయింది’ అని బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ నెటిజన్లపై మండిపడ్డారు. తైమూర్‌ అలీ ఖాన్‌కి జన్మనిచ్చిన తర్వాత రీఎంట్రీ ఇస్తూ.. ‘వీరె దె వెడ్డింగ్‌’ చిత్రంలో కరీనా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అయితే ఇటీవల నెటిజన్లు… “సెలబ్రిటీలను ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. అటువంటి వారు ఎంతో హుందాగా వ్యవహరించాలని, వస్త్రాలంకరణ వయసుకు తగ్గట్టుగా ఉండాలని కరీనా కపూర్‌ ఖాన్‌కు సూచించారు.’మీరొక ఆంటీ…టీనేజర్‌గా భావించకండి’ అని పోస్టు చేశారు. ఫొటోలపై విమర్శలూ చేస్తున్నారు.
ఈ కామెంట్లకు కరీనా ఘాటుగా స్పందించింది… ‘సెలబ్రిటీల ఫీలింగ్స్‌ గురించి ఆడియెన్స్‌కి ఏమాత్రం అవగాహన లేదు. సెలబ్రిటీలకు ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌ ఉండని అనుకుంటారు. కానీ మాక్కూడా ఫీలింగ్స్‌ ఉంటాయని గుర్తుంచుకోండి. చులకనగా మాట్లాడటం సరైనది కాదు. మీ ఆలోచనా విధానం మానుకోండి’ అని కరీనా పేర్కొంది.
 
ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ
‘తఖ్త్‌’ సినిమాలో చేస్తున్న పాత్ర గుర్తుంచుకోదగ్గదని, ఆ సినిమాలో తన క్యారెక్టర్‌కు అంత ప్రాధాన్యం ఉందని కరీనా కపూర్‌ చెప్పింది. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రణవీర్‌ సింగ్‌, అలియా భట్‌, విక్కీ కౌసల్‌, భూమి పడ్నేకర్‌, జాన్వి కపూర్‌, అనిల్‌ కపూర్‌ ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆ క్యారెక్టర్‌ గురించి ఆమె మాట్లాడుతూ…”ప్రస్తుతం ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాను. ఇదొక హిస్టారికల్‌ పీరియాడ్‌ డ్రామా. మొఘల్‌ చక్రవర్తులకు చెందిన ఇద్దరు అన్నదమ్ముల కథ. ఇందులో నా పాత్ర చాలా ముఖ్యమైంది.ఎందుకంటే.. ఆ పాత్రలో సామాజిక అంశాలు ఉంటాయి. ఇటువంటి సినిమాలో నేను ఇప్పటి వరకూ నటించలేదు. ఈ పాత్ర కోసం ఇప్పటికే ప్రిపరేషన్‌ పూర్తయింది. చాలా కాలం తర్వాత కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో పని చేస్తున్నా”అని పేర్కొంది కరీనా.
 
త్వరలో పెళ్లి పెట్టుకుని లిప్ కిస్ లా ?
సినిమాల్లో లిప్ కిస్ లు అత్యంత సహజంగానూ మారిన రోజులివి. హిందీ కథానాయిక కరీనా కపూర్‌ అయితే పదేళ్ళ కిత్రం ‘కంబఖ్త్‌ ఇష్క్‌’లో అక్షయ్‌కుమార్‌తో అధర చుంబనాల్లో రికార్డు సృష్టించారు. అందులో పది లిప్‌ కిస్సుల వరకూ ఉంటాయి. మాజీ ప్రియుడు షాహిద్‌ కపూర్‌తో ‘జబ్‌ వుయ్‌ మెట్‌’లో అధర చుంబన దృశ్యంలో నటించారు. అయితే… ఆరేళ్ల క్రితం ‘సత్యాగ్రహ్‌’లో అజయ్‌ దేవగన్‌తో ముద్దు సన్నివేశంలో నటించడానికి కరీనా కపూర్‌ నో చెప్పారట! ఎందుకో తెలుసా? అప్పట్లో సైఫ్‌ అలీఖాన్‌తో ఆమె పెళ్లి నిశ్చయం కావడమే! త్వరలో పెళ్లి పెట్టుకుని తెరపై అధర చుంబన దృశ్యాల్లో నటించడం సమంజసం కాదని కరీనా కపూర్‌ భావించారట!పెళ్లి తర్వాత కూడా ముద్దు సన్నివేశాల్లో ఆమె నటించలేదు. ప్రస్తుతం ‘గుడ్‌ న్యూస్‌’ చిత్రంలో ‘కంబఖ్త్‌ ఇష్క్‌’ కో-స్టార్‌ అక్షయ్‌కుమార్‌తో నటిస్తున్నారామె.