కొత్తదనాన్ని కొనసాగించాలనే అవి వేసుకుంటా !

కరీనా కపూర్‌ ఖాన్‌… వివాహం తర్వాత మళ్లీ సినిమాల్లో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించే పనిలో నిమగమైంది. దీని కోసం వ్యాయామశాలల్లో రోజంతా కసరత్తులు చేస్తోంది. బాలీవుడ్‌లో ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిత్యం వెలుగుతూ ఉంటుందీ అమ్మడు. లేక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఆమె మాట్లాడుతూ… ‘ నామీద నాకున్న నమ్మకమే నన్ను నిత్యం కొత్తగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు,నేను నాకు 19ఏళ్ల వయసులోనే ప్రయోగాలు చేసేశాను. అప్పటి నుంచి నిత్యం కొత్తగా, విభిన్నంగా ఉండేలా తపిస్తుంటా. ఆ కొత్తదనాన్ని ఇంకా కొనసాగించాలనే నేను నిత్యం జీన్స్‌, టీషర్ట్స్‌లో ఉంటాను. నాకు ‘ఏది బాగుంటుందో.. ఏదీ బాగోదో’ బాగా తెలుసు. నేను యుక్తవయసులోనే విభిన్నంగా కనిపించడం కోసం అనేక ప్రయోగాలు చేసేదాన్ని. అసలు నా అరంగేట్రమే ఓ ప్రయోగం. అప్పటికి నేనేమీ ఫ్యాషన్‌గా ఉండే అమ్మాయిని కాదు. కానీ నెగ్గుకు రాగలిగాను. నా ఆలోచనలే నన్ను ఇలా చేశాయి. పదేళ్లకు ఇప్పటికీ చాలా మారిపోయాను. గతంలో ఎక్కువగా పని చేసేదాన్ని కాదు. అప్పుడే మానేసి ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్‌ చిత్రసీమలో ఉండేదాన్ని కాదు. నా జీవితంలో చాలా జరిగాయి. అవే నన్ను ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా చేశాయి ‘ అని చెప్పింది కరీనా కపూర్‌.
ఆ తప్పు జరగనివ్వను !
కరీనా కపూర్‌ ఖాన్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఎంతో సక్సెస్‌ను చూసిన ఆమెను ఓ బాధ వెంటాడుతోంది. చిన్న వయసులో సినిమాల్లోకి రావడంవల్ల చదువుకోలేకపోయానన్న బాధ కరీనాకి ఉంది… ‘‘నేటి ఆధునిక యుగంలో చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నా 17 ఏళ్ల వయసులో నేను కథానాయికగా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. ఆ తర్వాత చదువుకోవడం కుదర్లేదు. అప్పుడు చదువుకోలేకపోయినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.నా కొడుకు తైముర్‌ విషయంలో ఆ తప్పు జరగనివ్వను. చదువు పూర్తయిన తర్వాతనే తైముర్‌ కోరుకున్న ఫీల్డ్‌లో వర్క్‌ చేసేలా ప్లాన్‌ చేస్తాను’’ అని ఓ రేడియో షోలో కరీనా కపూర్‌ తన ఆలోచనను పంచుకున్నారు. 2000లో ‘రెఫ్యూజీ’ అనే హిందీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన కరీనా 2012లో నటుడు సైఫ్‌ అలీఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సైఫ్‌–కరీనా దంపతులకు తైముర్‌ అనే బాబు పుట్టిన సంగతి తెలిసిందే. ‘గుడ్‌న్యూస్‌’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు కరీనా.