గ్లామర్ షో తో పాటు ఐటం సాంగ్స్‎ కూ రెడీ !

 పెళ్ళైన హీరోయిన్లు ఆన్ స్క్రీన్‎పై కనిపించే విషయంలో కాస్త పద్ధతిగా ఉంటారనే టాక్ ఉంది. అయితే ‘యే దిల్ హే ముష్కిల్’ సినిమాలో కుర్ర హీరో రణ్ బీర్ తో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన ఐశ్వర్యరాయ్, తమకు ఇలాంటి బౌండరీలు ఏవీ లేవని నిరూపించింది.ఈమెను చూసి స్పూర్తి పొందిందో తాజాగా ఐష్ బాటలోనే మరో మ్యారీడ్ హీరోయిన్ కరీనా కూడా ఆన్ స్క్రీన్‎పై మునుపటిలా రెచ్చిపోయేందుకు సిద్ధమవున్నట్టు తెలుస్తోంది…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‎ను పెళ్లాడిన తరువాత కూడా సినిమాల్లో నటించిన కరీనా స్కిన్ షో విషయంలో కాస్త ఆచితూచి ముందుకు సాగింది.  ఇక కొన్ని నెలల క్రితం అబ్బాయికి జన్మనిచ్చిన ఈ బాలీవుడ్ భామ, కొద్ది నెలల్లోనే మళ్లీ స్లిమ్‎గా మారి సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది. మళ్లీ అందాల ప్రదర్శనకు సిద్ధమైందట. అయితే మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న కరీనా, స్కిన్ షో విషయంలో కండీషన్స్ పెట్టొద్దని భావిస్తోందట. ‘హీరోయిన్‎గా అవకాశాలు రావాలంటే ఎంతో కొంత గ్లామర్ ఒలకబోయాల్సిందే’ అని భావిస్తున్న బెబో. మళ్లీ అవకాశాలు వరుసగా క్యూ కట్టేంతవరకు అందాల ప్రదర్శన చేయాలని డిసైడయ్యిందట.హీరోయిన్ ఆఫర్లతోపాటు అవకాశం వస్తే ఐటం సాంగ్స్‎లోనూ స్టెప్పులేయాలని ఈ మ్యారీడ్ హీరోయిన్ భావిస్తున్నట్టు సమాచారం.
ఆమెకు సల్మాన్ నటించబోయే ఒక సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చిందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  చూస్తుంటే ఒక అబ్బాయికి తల్లిగా మారిన తరువాత కూడా కరీనాలో ‘తను ఇంకా  గ్లామర్ హీరోయినే’  అనే ఫీలింగ్ ఏ మాత్రం తగ్గనట్టు కనిపిస్తోంది.అయితే ఒకప్పటిలా ఆమెకు అవకాశాలు వస్తాయని ఊహించలేమని సినీజనం అనుకుంటున్నారు.