అప్పటిలానే ఉంది.. గ్లామర్ సీక్రెట్ చెప్పింది!

డబుల్‌ రోల్స్‌ చేయాలన్నది తన కోరికని కరీనాకపూర్ చెప్పింది. ‘సీత ఔర్ గీత’, ‘చాల్‌బాజ్‌’ వంటి చిత్రాలు చూడడమంటే చాలా ఇష్టమని పేర్కొంది కరీనా. శ్రీదేవి డబుల్‌ రోల్‌ పోషించిన ‘చాల్‌బాజ్‌’ చిత్రాన్ని 35 సార్లు చూశానని చెప్పింది. ‘ఇప్పటి వరకూ నేను ఈ తరహా పాత్రలు చేయలేదు కాబట్టే.. ద్విపాత్రాభినయం చేసే చిత్రాల్లో నాకు అవకాశాలు రావడం లేదు’ అని తెలిపింది. బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో కరీనా కపూర్‌ ఖాన్‌ పేరు కూడా ఉంటుంది. కరీనా చాలా విభిన్నమైన పాత్రలను పోషించింది. నటిగా తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. ఒక పక్క కుటుంబం, మరో పక్క నటన సమతూకంలో చూస్తోంది.
యువ హీరోయిన్లకు ధీటుగా …
‘కహోనా ప్యార్ హై’ చిత్రంలో కరీనాకపూర్ హృతిక్ సరసన నటించాల్సింది. కానీ ‘రెఫ్యూజీ’లో అభిషేక్ బచ్చన్ సరసన నటించి సినీ రంగ ప్రవేశం చేసింది కరీన. హృతిక్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్… అభిషేక్ సినిమా అట్టర్ ఫ్లాపైంది. అయితే దీంతో ఆమె కెరీర్‌ తలకిందులు కాలేదు. దాదాపు 17 ఏళ్లుగా కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. టాప్ హీరోయిన్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని .. ఇప్పటికీ కెరీర్‌పరంగా ఢోకాలేని హీరోయిన్‌గానే కొనసాగుతోంది. ఇద్దరు హీరోలతో కరీనా ఎఫైర్ సాగించిందని వార్తలొచ్చాయి. ఒకరు హృతిక్ రోషన్‌.. మరొకరు షాహిద్ కపూర్. చివరికి సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్‌ని పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత ఆమెకు ‘తైమూర్ అలీఖాన్ పటౌడి’ అనే బాబు పుట్టాడు.
అనంతరం మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. యువ హీరోయిన్లకు ధీటుగా తిరిగి ఫిట్‌నెస్ సంపాదించి.. సినిమాలు చేస్తోంది. అప్పటి సినిమాల్లో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ గ్లామర్ సీక్రెట్ చెప్పింది కరీనాకపూర్. రోజూ ‘సూర్య నమస్కారాలు’ చేయడం ఆ రహస్యమని పేర్కొంది. 50 సూర్య నమస్కారాలు ఏకధాటిగా చేసేస్తుందట కరీనాకపూర్. దీంతో పాటు డైటింగ్ కూడా చేస్తూ మెరుపుతీగలా మారింది .
కరీనా తాజాగా ‘అంగ్రేజీ మీడియం’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. తొలిసారిగా ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుంది. ‘గుడ్‌ న్యూస్‌’ సినిమా చిత్రం కూడా పూర్తి చేసింది. అమీర్ ఖాన్ తో ‘లాల్ సింగ్ చద్దా’లో చేస్తోంది