యువ హీరోలతో రొమాన్స్‌ చేస్తే తప్పేంటి?

‘నా వయసు పెరిగే కొద్దీ నా కంటే చిన్న వయసు హీరోలతో రొమాన్స్ చేస్తాను. పెద్ద వయసువారు చిన్న వయసు వారితో రొమాన్స్ చేయలేరు అన్న అభిప్రాయాన్ని మారుస్తాను. ప్రేమలో పడటానికి వయసుతో సంబంధం లేదు. కావాలంటే ప్రియాంక చోప్రాను చూడండి. తన కంటే పదేళ్లు చిన్న వయసున్న కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను కూడా నాకంటే పదేళ్లు పెద్దవాడైన సైఫ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందులో తప్పు లేదు. అయితే అలాంటి సినిమాలు తీయకూడదు అనుకుంటున్న నిర్మాతల ఆలోచనా విధానంలో మార్పు రావాలి’ అని అంటోంది కరీనా కపూర్.
కరీనా కు బాలీవుడ్‌లో ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పెళ్లై, ఓ పిల్లాడికి తల్లైనా కూడా ఓ కుర్ర హీరోయిన్‌కి వచ్చే అవకాశాల కంటే ఎక్కువ ఛాన్సెస్ కరీనాకు వస్తున్నాయి. అయితే ఇక నుంచి తన కంటే చిన్న వయసున్న కుర్ర హీరోలతో రొమాంటిక్, సెక్సీ సన్నివేశాల్లో నటించాలని అనుకుంటున్నట్లు కరీనా చెప్పింది . తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రియాంక చోప్రానే అని అంది .
 
కరీనా కపూర్‌కి ప్రస్తుతం నలభై ఏళ్లు. ఈమె అక్షయ్ లాంటి హీరోలతో సినిమా చేస్తే ఓకే. కానీ అర్జున్‌ కపూర్‌తో(కీ అండ్‌ కా), సుమీట్‌ వ్యాస్‌ (వీరే డీ వెడ్డింగ్‌) చిత్రాలు చేసింది. ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ…
“ఇటువంటి చిత్రాలు, కథలు, సన్నివేశాలు ఉండడం వెనుక రచయితలు, దర్శకులు, స్టూడియోస్‌, నిర్మాతలు ఉన్నారు. వారంతా ప్రస్తుతం మార్పు కోరుకున్నారు. ప్రియాంక చోప్రా తనకంటే చిన్న వయస్సు ఉన్న నిక్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. నేను, నా కంటే ఎక్కువ వయస్సు ఉన్న సైఫ్‌ అలీఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇదే ఈ దర్శక నిర్మాతలకు స్ఫూర్తి. నా వయసు వాళ్లు యువ హీరోలతో రొమాన్స్‌ చేయడంలో తప్పేముంది? ఈ మార్పు మంచిదే. ఈ మార్పు నా మనసులో నుంచి వచ్చింది కాదు. అది నిర్మాతలు కావాలని కోరుకున్నదే” అని చెప్పింది.
 
అక్షయ్ కుమార్‌తో  కరీనా కపూర్ నటించిన ‘గుడ్ న్యూస్’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె ఆమిర్ ఖాన్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. దీంతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘తఖ్త్’ సినిమాలోనూ నటించనున్నారు.