నటన తప్ప మరే జీవితాన్ని నేను ఊహించుకోలేదు !

‘యాక్టింగ్‌ లేని నా జీవితాన్ని ఊహించుకోలేను. నటనే నా జీవితం’ అని అంటోంది కరీనా కపూర్‌. ‘ఉడ్తా పంజాబ్‌’ తర్వాత ప్రెగేన్సీ కారణంగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన కరీనా ఇటీవల రీ ఎంట్రీ ఇస్తూ ‘వీర్‌ ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవారని అడిగిన ప్రశ్నకు కరీనా చెబుతూ…. ‘చిత్ర పరిశ్రమలో 18ఏండ్లుగా నటిస్తున్నాను. అప్పట్నుంచి సినిమాల గురించే ఆలోచిస్తున్నాను. చిన్నప్పట్నుంచి నటిని కావాలని కలలు కన్నాను. నటన తప్ప మరే జీవితాన్ని నేను ఊహించుకోలేదు.  ఎప్పడూ ఆలోచించలేదు. నటులకు అవార్డులు, గౌరవాలు కూడా ముఖ్యమే. సినిమాల్లో మేం చేసిన కష్టానికి వచ్చే పురస్కారాలవి’ అని తెలిపింది.

ఇదిలా ఉంటే తన తనయుడు తైమూర్‌ను భవిష్యత్‌లో ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు చెబుతూ…..’తైమూర్‌కు ఇప్పటికే మాకంటే ఎక్కువగా స్టార్‌డమ్‌ వచ్చింది. ఈ విషయంలో ఇబ్బందిగా ఉంది. అందుకే ఇంగ్లాండ్‌లోని ఓ బోర్డింగ్‌ స్కూల్లో చేర్పించాలనుకుంటున్నాం. దీని వల్ల తను ఆ స్టార్‌డమ్‌ నుంచి బయటపడతాడు. ఇక భవిష్యత్‌లో వాడిని క్రికెటర్‌ను చేయాలనేది నా కోరిక’ అని తెలిపింది. శశాంక ఘోష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వీర్‌ ది వెడ్డింగ్‌’ చిత్రంలో కరీనాతోపాటు సోనమ్‌ కపూర్‌, స్వర భాస్కర్‌ తదితరులు నటిస్తున్నారు. మహిళా ప్రధానంగా సాగే ఈ కామెడీ చిత్రం జూన్‌ 1న విడుదల కానుంది.

మళ్లీ సైజ్‌ జీరో కోసం ప్రయత్నిస్తుందా ?

కరీనా కపూర్‌కు ఏమైంది, అసలు ఆమె ఆహారం తీసుకుంటుందా లేదా? ఎందుకిలా అస్థిపంజరంలా మారిపోయింది…మళ్లీ ఏదైనా సర్జరీ చేయించుకుందా, లేదా మళ్లీ సైజ్‌ జీరో కోసం ప్రయత్నిస్తుందా?…అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విషయమేంటంటే ….కరీనా కపూర్‌ అప్పుడప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె ర్యాంప్‌ వాక్‌చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2016 డిసెంబర్‌లో తైమూర్‌ పుట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ర్యాంప్‌ వాక్‌ చేశారు.తన అభిమాన డిజైనర్‌ మనిష్‌ మల్హోత్రా కోసం తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అమృత అరోరాతో  కలిసి సింగపూర్‌లో నిర్వహించిన ఒక ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఈ ఫోటోల్లో కరీనా మరీ పీలగా.. చిక్కిపోయినట్లు ఉన్నారు. ఈ ఫోటోలు చూసి నిరుత్సాహపడిన అభిమానులు కరీనాకు ఏమైంది అస్థిపంజరంలా తయారయ్యింది, మళ్లీ సైజ్‌ జీరో కోసం ప్రయత్నిస్తుందా, ఏదైనా సర్జరీ చేయించుకుందా? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కొందరు కరీనా తన వయసు కంటే పెద్దదిగా కన్పిస్తుందని కామెంట్‌ చేశారు.తల్లి అయ్యాక కరీన తన బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమపడ్డారు. అందుకు సంబంధించి ఆమె జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు.