‘కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర’ ఆడియో విడుదల!

భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు కీ.శే.. యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పాడడం విశేషం.జి.జే రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ భాస్కర్, అనుషా,అశోక్ కుమార్, ఆనంద్ భారతి,వి.మురళీధర్ లు నటిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక  ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హ్యుమాన్ రైట్స్ చైర్మన్ జె.సి. చంద్రయ్య, బి.సి.కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణ మెహన్, దైవజ్ఞ శర్మ లు ఆడియోను విడుదల చేయగా నిర్మాతలు సాయి వెంకట్, రాం సత్య నారాయణ,నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు యస్.వి.యన్.రావ్,వెంకటేశ్వర రాజు, నటికర్ రవి, బి.సి. కార్పొరేషన్ మెంబెర్  ఉపేంద్ర, శాంతా కుమారి, బి.నరసింగ్ రావ్, నేతికర్ శ్రీనివాస్, అనుషా, నటుడు  శ్రీనివాస్, రాజేష్ ,భాగ్యలక్ష్మి తదితరులు ఈ చిత్రంలోని పాటలను విడుదల చేశారు.

చిత్ర నిర్మాత ఉల్కందే కార్ మురళీధర్ మాట్లాడుతూ.. దర్శకుడు జి.జే. రాజా 10 సంవత్సరాల క్రితం రాసుకున్న ఈ కథను ఎంతో మందికి వినిపించడం జరిగింది. ఈ కథను విన్న రామానాయుడు గారు తీస్తానని ముందుకు వచ్చాడు. అంతలో తను పరమపదించాడు. ఇలా ఎంతోమందిని అడిగిన తర్వాత నాకీ కథ చెప్పడం జరిగింది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి మాకు మూడు సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం ఒక సినిమాను రెండు నెలల్లో పూర్తి చేస్తారు కానీ మేము సమాజానికి సనాతన భారతీయ సంస్కృతిని  మళ్లీ ఒక సారి అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినందున ప్రతి దాన్ని క్లుప్తంగా పరిశీలిస్తూ అప్పటి కాలానికి తగినటువంటి ప్రాంతాలను,పాత కాలం మందిరాలను, ఆలయాలను సెలెక్ట్ చేసుకుంటూ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీయడం జరిగింది.. అన్నారు

చిత్ర దర్శకుడు జి.జే రాజా మాట్లాడుతూ.. ధర్మవ్యాధుడు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని సినిమా తీయడం జరిగింది.  వృత్తులు పుట్టిన తర్వాతనే కులాలూ పుట్టాయి కానీ కులాల ముందు పుట్టలేదు. వ్యక్తులు ఏ ఏ వృత్తులు చేస్తూ ఉంటారో దాన్నిబట్టే కులాలు ఎర్పడ్డాయి.మహానుభావుడు ధర్మవ్యాధుడు. అలాంటి వారి చరిత్రను సినిమాగా తీసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు.. అన్నారు.