వీరిని అర్థం చేసుకోవడానికి అంత సమయం పట్టింది !

‘జగ్గా జాసూస్’ చిత్రం జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మాజీ లవర్స్ రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఇది .  ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రణబీర్, కత్రినాలు. అయితే ఈ ప్రమోషన్లలో రణబీర్‌పై నానా రకాల  సెటైర్లు వేస్తోంది కత్రినా. “రణబీర్‌తో పనిచేయడమే పెద్దతలనొప్పి” అంటూ నవ్వుతూ చెప్పేస్తోంది ఈ బ్యూటీ. వీరు బ్రేకప్ అయ్యారు కాబట్టి తప్పు రణబీర్‌దే అనే ప్రచారం జనాల్లోఉంది.

దీంతో కత్రినా ఏం చెప్పినా అదే కరెక్ట్ అని అనుకుంటున్నారు జనాలు. ఇక సినిమాలో రోల్ గురించి చెప్పమంటే… ఈ మూవీలో తాను జర్నలిస్టుగా నటించానని చెప్పింది కత్రినా. “జర్నలిస్టుగా కనిపించడానికి దాదాపు 100 గంటల పాటు టివి చూసి గమనించాను. జర్నలిస్టులను అర్థం చేసుకోవడానికి నాకు అంత సమయం పట్టింది. దీంతో సినిమాలో పాత్రికేయురాలిగా చక్కగా నటించగలిగాను”అని చెప్పింది కత్రినాకైఫ్. అయితే మామూలుగా  జర్నలిస్టులకు ఎప్పుడూ  తల  పొగరుగా సమాధానాలు చెప్పే కత్రినా… జర్నలిస్టులను  అర్ధం చేసుకోవడానికి  ప్రయత్నించడమేంటని ఆశ్చర్య పోతున్నారు బాలీవుడ్ జనాలు !