వివక్ష పోవాలంటే.. ఆ తరహా చిత్రాలే ఎక్కువ రావాలి!

హాలీవుడ్ చిత్రాలను పరిశీలిస్తే మహిళా ప్రాధాన్య చిత్రాల కోసం ఎటువంటి కథలు వస్తున్నాయో మనకు అర్ధమవుతుంది. చార్లెజ్‌ థెరోన్‌, నికోలే కిడ్మాన్‌ ఇలాంటి చిత్రాలు చేస్తూ రాణిస్తున్నారు. వీళ్లు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే చేస్తూ సక్సెస్‌ అవుతున్నారు… అని అంటోంది కత్రినా కైఫ్‌. ఈ మధ్య బాలీవుడ్‌ హీరోయిన్లు మహిళా ప్రాధాన్య చిత్రాల గురించే చెబుతున్నారు. పారితోషికంలోనూ.. అవకాశాల్లోనూ ప్రస్తుతం ఉన్న వివక్ష పోవాలంటే ..మహిళా ప్రాధాన్య చిత్రాలు  ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందని  అంటున్నారు. దీనిపై ఇటీవలే తాప్సీ మాట్లాడింది. ఇప్పుడు కత్రినా కైఫ్‌ కూడా అదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో చెప్పింది…
 
“బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాలు రావాల్సి ఉంది. అందులోనూ కామెడీ.. కమర్షియల్‌ హంగులతో మహిళలు లీడ్‌ రోల్స్‌ పోషించాలి. బాలీవుడ్‌లో దానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాది దేశాలను ఓ సారి పరిశీలిస్తే.. రచయితలు మహిళా ప్రాధాన్య చిత్రాల కోసం ఎటువంటి కథలు అందిస్తున్నారో అర్ధమవుతుంది. చార్లెజ్‌ థెరోన్‌ గానీ, నికోలే కిడ్మాన్‌ గానీ చాలా కాలంగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే చేస్తూ రాణిస్తున్నారు.ఇక్కడ కూడా అటువంటి అద్భుతమైన రచనలు చేయాలి. సినిమాలు, రియాల్టీ షోస్‌లో మహిళలు ప్రధానంగా కనిపించేలా చేయాలి. అలాంటి పరిస్థితులు నటీమణులే కల్పించాలి. మహిళలు ఉత్తమ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వగలమని నమ్మకం కలిగించినప్పుడే అలాంటి కథలు సృష్టించాలనే ఆలోచన రచయితలకు వస్తుంది” అని చెప్పింది కత్రినా. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్‌ హీరోగా చేస్తున్న ‘సూర్యవంశి’ చిత్రంతో బిజీగా ఉంది కత్రీనాకైఫ్‌.
 
బాక్సింగ్‌ సినిమా చేయబోతుందా?
త్వరలో నా నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ రాబోతుంది“.. అని అంటోంది కత్రినా కైఫ్‌. ఆమె గ్లామర్‌తోనే కాదు,యాక్షన్‌తోనూ మెస్మరైజ్‌ చేయగల నాయిక . పలు యాక్షన్‌ చిత్రాల్లో అలరించింది. త్వరలో కత్రినా సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుందట. ఇటీవల కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరల్డ్‌ ఛాంపియన్‌ బాక్సర్‌ మేవెదర్‌ ఫొటోని, తాను బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోని అభిమానులతో షేర్‌ చేసుకుంది. ” మేవెదర్‌ బూట్స్‌ వణక్కపోవచ్చు.. కానీ, నేను ఆ స్థానంలోకి వెళ్తున్నా. త్వరలో నా నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ రాబోతుంది” అని కత్రినా ఓ చిన్న క్లూ ఇచ్చింది. దీంతో త్వరలో బాక్సింగ్‌ నేపథ్యంలో ఉండే చిత్రంలో నటించబోతుందని అందరూ ఊహించుకుంటూ.. తెగ కామెంట్స్‌ పెడుతున్నారు. నిజంగానే కత్రినా బాక్సింగ్‌ సినిమా చేయబోతుందా? లేక మేవెదర్‌తో కలిసి నటిస్తుందా.. ఆమె నుంచి వచ్చే సర్‌ప్రైజ్‌ ఎలా ఉంటుందోనని బాలీవుడ్‌లో ఆసక్తి పెరిగింది . ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘ఏక్‌ దా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి చిత్రాల్లో తనదైన యాక్షన్‌తో మెప్పించిన కత్రినా మరో యాక్షన్‌ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్టు అర్ధమవుతోంది.
 
అక్షయ్‌ తో కలిసి రీమిక్స్‌ వాన పాట
పాపులర్‌ పాటలన్నీ కొత్త గా రీమిక్స్‌ చేసే ట్రెండ్‌ ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఉంది. తాజాగా అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ రీమిక్స్‌ సాంగ్‌కు స్టెప్‌ వేయనున్నారు. ‘సూర్యవంశి’ లో కత్రినా కైఫ్‌ కథానాయిక గా అక్షయ్ ఈ పాట చేస్తారు. అక్షయ్ ‘మోహ్రా’ సినిమాలో ప్రతీ పాట బ్లాక్‌బస్టరే. ‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌ మస్త్‌..’, ‘నా కజ్రే కా దర్‌’ పాటలు ఆ సినిమాలోవే. ‘మోహ్రా’ లో అక్షయ్, రవీనా టాండన్‌ వాన పాట ‘టిప్‌ టిప్‌ బర్సా పానీ…’ ఎంతో పాపులర్ అయ్యింది . అక్షయ్, కత్రినా కాలు కదపనున్న ఈ ‘టిప్‌ టిప్‌ బర్సా పానీ..’ రీ మిక్స్ పాటకు ఫర్హాఖాన్‌ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఒకప్పుడు తాను చేసిన పాటను మళ్లీ తన తోనే రీమిక్స్‌ చేయడం పట్ల అక్షయ్‌ స్పందిస్తూ… ‘‘ఈ పాటను వేరే ఎవరు రీమిక్స్‌ చేసినా కచ్చితంగా నిరుత్సాహపడేవాణ్ణి. ఎందుకంటే.. నాకు, నా కెరీర్‌కు ఈ పాట చాలా స్పెషల్‌’’ అన్నారు.