దాని కోసం సవాళ్లను కూడా ఎదుర్కొంటా !

కత్రినా కైఫ్‌… షారుఖ్‌ ఖాన్‌, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ నటించిన ‘జీరో’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టినా కత్రినా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మద్యానికి బానిసైన సెలబ్రిటీగా మెప్పించింది. ఈ సినిమాలో చేసిన పెర్ఫార్మెన్స్‌ మరోసారి ఏ సినిమాలో చేసినా దాన్ని నేరం గానే భావిస్తానని కత్రినా చెప్పింది. ”నేను ఇక్కడ చేసిన పెర్ఫార్మెన్స్‌ ఇంకెక్కడైనా చేస్తే దాన్ని అపరాధంగానే భావిస్తా. ఇది నా అభిప్రాయం. ఎప్పుడూ పాత్రతో, సంబంధింత సినిమాతో కనెక్ట్‌ అవ్వాలి. అదే అవసరం. కొత్తగా చేయడాన్ని సవాలుగా తీసుకుని స్ఫూర్తిని పొంది చేయాలి. ప్రశంసలు పొందినప్పుడు.. అవి నిత్యం సంతోషాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. అదొక అద్భుతమైన భావన. ఎందుకంటే నటులను ప్రేక్షకులు సొంత వ్యక్తులుగా ఆరాధిస్తారు. ఇక్కడ మనకి మనమే నటులుగానూ, ప్రేక్షకులు గానూ ఊహించుకుంటూ వారి స్థానాల్లో ఉండి ఆలోచించాలి. వివిధ పాత్రల్లో ఊహించుకుంటూ ఆడియెన్స్‌కు నచ్చుతుందా? లేదా? అన్నది చూడాలి.

‘న్యూయార్క్‌’ సినిమా చేస్తున్నప్పుడు నేను చేసే పాత్రలో నిమగమైపోయాను. దాని నుంచి చాలా నేర్చుకున్నాను. నిరంతరం పని చేస్తూ ఉండడం వల్ల అనుభవం పెరుగుతూ ఉంటుంది. ఏళ్లు, రోజులు, గంటలు సెట్స్‌లో గడిపినప్పుడు పాత్రపై అవగాహనా బలం పెరుగుతుంది. నేను ఎక్కడ ఎవరితో పని చేసినా హాయిగా ఉండేది. ఫన్‌ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. నాకు నేను అభివృద్ధి చెందాలని, విభిన్నమైన పాత్రల్లో కనిపించాలని అనుకుంటాను. దాని కోసం సవాళ్లను కూడా ఎదుర్కొంటాను. ఎందుకంటే నటన అంటే నాకు పిచ్చి. పాషన్‌” అని చెప్పింది.

ట్రెండీ, గ్లామర్‌గా ఉండాలని హాట్‌ డ్రెస్‌లు వేసుకుంటారా? ‘క్వీన్‌’, ‘రాజీ’, ‘డర్టీ పిక్చర్‌’ వంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ…’ మంచి సినిమా ఎప్పుడూ మంచిదే. ప్రతిసారీ ట్రెండ్‌ను అనుసరించాలి. కొన్ని సార్లు కొత్తవి రాణిస్తాయి. అప్పుడది ట్రెండ్‌ అవుతుంది. ఎవరినో అనుసరించే కంటే నా పాత్‌ నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నా. ఎటువంటి కథలను ఎంపిక చేసుకుంటున్నా అనే దానిపై దృష్టిసారించాలి. నేను తీసుకునే నిర్ణయాలన్నీ నిజాయితీగానే ఉంటాయి. నేను చేసిన పాత్రలు నా ఛాయిస్‌ అనే కంటే అలవాట్లు అంటే బాగుంటుంది” అని చెప్పింది.

సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ వివాహం
సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్.. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఇది రియల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లో.  వీరిద్దరూ కలిసి నటిస్తోన్న ‘భారత్’ సినిమాలో సల్మాన్, కత్రినాల పెళ్లి సన్నివేశాలు ఉంటాయట. ఓ భారీ వెడ్డింగ్ సీన్ ని ప్లాన్ చేశాడు దర్శకుడు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది.
అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్, కత్రినాలు వెడ్డింగ్ సీక్వెన్స్ కు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనున్నారు. ఇటీవల ‘భారత్’ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.అలీ అబ్బాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్, కత్రినాలతో పాటు జాకీష్రాఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు.